Vastu Tips for Kitchen: మీ ఇంటిల్లిపాది ఆనందం, ఆరోగ్యానికి మూలమైన వంటిగది కోసం వాస్తు చిట్కాలు.. ఇవన్నీ తప్పనిసరి..!
అలా చేస్తే,.. అన్నపూర్ణా దేవితో పాటు లక్ష్మీదేవికి కూడా ఆగ్రహం వస్తుందని చెబుతారు. ఫలితంగా ఆ ఇంట్లోని వారికి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు రాత్రిపూట వంటగదిలో ఎప్పుడు ఖాళీ పాత్రలను ఉంచకూడదు. ఒక్క ముద్ద ఆహారం అయినా సరే మీ వంటపాత్రలో ఉండేలా చూసుకోండి.
వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్రతి ఇంటికి వంటగది అతి ముఖ్యమైన ప్రదేశం. మత విశ్వాసాల ప్రకారం వంటగది అన్నపూర్ణ దేవి నివాసంగా భావిస్తారు. ఆమె ప్రధానంగా ఆహార దేవత. తల్లి అన్నపూర్ణ దేవి మీ ఇంట్లో సంతోషంగా ఉంటే, మీరు ఆహార కొరత లేకుండా ఉంటారని నమ్ముతారు. వంటగదికి సంబంధించిన అనేక నియమాలు వాస్తు శాస్త్రంలో పేర్కొనబడ్డాయి. మీరు మీ వంటగదిలో వాస్తు నియమాలను జాగ్రత్తగా చూసుకుంటే, మీరు అన్నపూర్ణ దేవి ఆశీస్సులు, ధనలక్ష్మి కాటాక్షం పొందవచ్చు. దీని వల్ల మీకు ఆహారం, డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు. అటువంటి పరిస్థితిలో అన్నపూర్ణా దేవిని ప్రసన్నం చేసుకునేందుకు పాటించాల్సిన వాస్తు టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఖచ్చితంగా ఈ పని చేయండి..
మత విశ్వాసాల ప్రకారం.. వంటగదిలో ఆహారం వండడానికి ముందు తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాత భక్తితో దండం పెట్టుకోవాలి. ఇలా చేస్తే అన్నపూర్ణ దేవి మీ పట్ల ప్రసన్నురాలవుతుంది. దీనితో పాటు అన్నపూర్ణ దేవి ఫోటో కూడా మీ వంటగదిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బు, ధాన్యం కొరత ఉండదు.
అన్నపూర్ణా దేవి ఆశీర్వాదం కోసం ఎప్పుడూ స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్లటం ఉత్తమం. అలాగే, రాత్రిపూట వంటగదిలో ఖాళీ పాత్రలను ఉంచకూడదు. అలా చేస్తే,.. అన్నపూర్ణా దేవితో పాటు లక్ష్మీదేవికి కూడా ఆగ్రహం వస్తుందని చెబుతారు. ఫలితంగా ఆ ఇంట్లోని వారికి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు రాత్రిపూట వంటగదిలో ఎప్పుడు ఖాళీ పాత్రలను ఉంచకూడదు. ఒక్క ముద్ద ఆహారం అయినా సరే మీ వంటపాత్రలో ఉండేలా చూసుకోండి.
వంటగదిలో నీరు, అగ్ని ఒకదానికొకటి దగ్గరగా ఉంచకూడదని వాస్తు శాస్త్రంలో నమ్ముతారు. దీనితో పాటు వంటగదిలో గ్యాస్‌ను తప్పనిసరిగా ఆగ్నేయ దిశలో ఉంచడం మంచిది. ఆహారం తీసుకునేటప్పుడు, మీ ముఖం ఈశాన్య దిశలో ఉండాలని గుర్తుంచుకోండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు