నేనే అందగాడిని.. అమ్మాయిలంతా నన్నే కోరుకుంటారు..! 20ఏళ్ల యువకుడికి ఇదో వింత రోగం..

24 గంటలు అవే ఆలోచనల్లో ఉండే వాడు. దాంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు కూడా చేసేవాడని వైద్యులు వెల్లడించారు. యువకుడి ప్రవర్తనతో తన కుటుంబాన్ని కూడా ఇబ్బందులకు గురిచేశాడని చెప్పారు. ఎట్టకేలకు వైద్యులు తన పరిస్థితిని గుర్తించి చికిత్స మొదలుపెట్టారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని చెప్పారు.

నేనే అందగాడిని.. అమ్మాయిలంతా నన్నే కోరుకుంటారు..! 20ఏళ్ల యువకుడికి ఇదో వింత రోగం..
Delusional Love Disorder
Follow us

|

Updated on: Apr 05, 2024 | 11:45 AM

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. ఇది వారి శరీరానికి సంబంధించినది లేదంటే మనస్సుకు సంబంధించినది కూడా కావచ్చు. సరైన వైద్యసహాయం, మద్దతుతో వారు తిరిగి మెరుగైన జీవనశైలిని గడిపే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక యువకుడు విచిత్రమైన, అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ 20 ఏళ్ల కాలేజీ విద్యార్థి గురించి చైనీస్ సోషల్ మీడియా సైట్‌లలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఆ విద్యార్థికి ఉన్న విచిత్రమైన వ్యాధి..డెల్యూజనల్ లవ్ డిజార్డర్ అనే అరుదైన వ్యాధితో విద్యార్థి అక్కడి అమ్మాయిలకు పెద్ద సమస్యగా మారాడు. దీంతో లియుకు వచ్చిన వింత వ్యాధి కారణంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు.

తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన 20ఏళ్ల యువకుడు సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అతను డెల్యూజనల్ లవ్ డిజార్డర్ అని పిలవబడే విచిత్ర పరిస్థితితో అవస్థపడుతున్నాడు. యువకుడు ఎదుర్కొంటున్న ఈ సమస్య కారణంగా అతడు చదువుతున్న యూనివర్సిటీలో ఫీమేల్ క్లాస్ మేట్స్ తనపట్ల రొమాంటిక్ ఫీలింగ్ కలిగి ఉన్నారని భావిస్తాడు. స్కూల్ లోనూ గర్ల్స్ అందరూ తన చుట్టే తిరగాలని ఆరాటపడేవారని డాక్టర్స్ కు చెప్పాడు. ఈ ప్రపంచంలో తానే బెస్ట్ లుకింగ్ బాయ్ అని మురిసిపోతుంటాడు. తనంటే ఇష్టం కాబట్టే అమ్మాయిలు నెగెటివ్ గా రెస్పాండ్ అయితే సిగ్గుపడుతున్నారనే భ్రమలో ఉండిపోయాడు. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలిసింది.

అయితే, లియు తనకున్న వ్యాధి కారణంగా తన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులను కూడా పట్టించుకోవటం వదిలేశాడు. సరైన నిద్ర, తిండి కూడా లేకుండా గడిపేవాడు..రాత్రంతా నిద్రపోకుండా.. 24 గంటలు అవే ఆలోచనల్లో ఉండే వాడు. దాంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు కూడా చేసేవాడని వైద్యులు వెల్లడించారు. యువకుడి ప్రవర్తనతో తన కుటుంబాన్ని కూడా ఇబ్బందులకు గురిచేశాడని చెప్పారు. ఎట్టకేలకు వైద్యులు తన పరిస్థితిని గుర్తించి చికిత్స మొదలుపెట్టారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..