AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే.. ఈ రోజు నుండే గుడ్లు తినండి..! ఒకటి రెండు కంటే ఎక్కువ.. ఎందుకో తెలుసా?

నీరసం, ఏదైనా పని చేసిన వెంటనే అలసిపోవడం, కడుపు ఉబ్బరం, శరీర శక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కూడా ప్రోటీన్ తక్కువైతే కనిపిస్తాయి. శరీరంలో ప్రొటీన్ స్థాయి తగ్గడం ప్రారంభిస్తే జలుబు, దగ్గును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య మళ్లీ మళ్లీ మొదలవుతుంది. శరీరంలో తగినంత మొత్తంలో ప్రోటీన్ ఉంటే మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు. ఇది మీకు బలహీనంగా అనిపించదు.

శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే.. ఈ రోజు నుండే గుడ్లు తినండి..! ఒకటి రెండు కంటే ఎక్కువ.. ఎందుకో తెలుసా?
Eggs
Jyothi Gadda
|

Updated on: Apr 05, 2024 | 9:03 AM

Share

శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలు మనల్ని పలు రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలను ముందుగానే పసిగట్టేలా సంకేతాలను అందజేస్తుంటాయి. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఈరోజు నుంచి మీరు బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు తినడం ప్రారంభించాలి. ఇది పుష్కలంగా ప్రోటీన్, పోషకాలను కలిగి ఉంటుంది. ఇది మీ శరీర కండరాలు, శరీరానికి చాలా మంచిది. మీరు అల్పాహారంగా 2 గుడ్లు తింటే, ఇది రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుందని అనుకుంటే సరికాదు. ప్రతి శరీరానికి వేర్వేరు అవసరాలు ఉంటాయి. గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఒకరి శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే, వారు ఒకటి లేదా రెండు మాత్రమే కాకుండా ఎక్కువ గుడ్లు కూడా తినవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు శరీరం అనేక హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. పొరపాటున కూడా మనం వాటిని విస్మరించకూడదు. అటువంటి సంకేతాలు అందిన వెంటనే మనం మంచి ప్రోటీన్ తీసుకోవడం పెంచాలి. శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే, దాని ప్రభావం జుట్టు, గోళ్లపై కనిపిస్తుంది. మీ గోర్లు, వెంట్రుకలు బలహీనంగా మారి, విరగడం, రాలడం ప్రారంభిస్తే మీరు వెంటనే గుడ్లు తీసుకోవడం పెంచాలి. శరీరంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుంది. శరీరం ఆహారాన్ని సరిగ్గా శక్తిగా మార్చుకోలేకపోతుందని దీని అర్థం. ఈ కారణంగా బరువు పెరగడం మొదలవుతుంది.

అంతేకాదు.. శరీరంలో ప్రొటీన్ లోపం కారణంగా రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఇది వ్యాధులతో పోరాడే శక్తిని తగ్గించేలా చేస్తుంది. అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. నీరసం, ఏదైనా పని చేసిన వెంటనే అలసిపోవడం, కడుపు ఉబ్బరం, శరీర శక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కూడా ప్రోటీన్ తక్కువైతే కనిపిస్తాయి. శరీరంలో ప్రొటీన్ స్థాయి తగ్గడం ప్రారంభిస్తే జలుబు, దగ్గును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య మళ్లీ మళ్లీ మొదలవుతుంది. శరీరంలో తగినంత మొత్తంలో ప్రోటీన్ ఉంటే మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు. ఇది మీకు బలహీనంగా అనిపించదు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?