AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత పొరపడ్డాం మిత్రమా..! ఆ విషయంలో మనుషుల వల్లే జంతువులకు డేంజర్‌ అట..? తాజా అధ్యయనంలో వెల్లడి

వైరస్‌లు మానవుల నుండి జంతువులకు చేరినప్పుడు, అది జంతువులకు హాని కలిగించడమే కాకుండా జాతులకు, ఆ జాతి పరిరక్షణ ముప్పును కూడా కలిగిస్తుందన్నారు. దాంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. అదనంగా, మానవులు ప్రవేశపెట్టిన కొత్త వైరస్ జంతు జాతులకు సోకినట్లయితే, వైరస్ మానవుల నుండి తొలగించబడిన తర్వాత కూడా అవి జీవించి ఉండే అవకాశం ఉంటుంది. అవే తిరిగి మళ్లీ కొత్త జాతులుగా రూపాంతరం చెంది మానవులకు సోకే ప్రమాదం కూడా తప్పక పొంచి ఉందన్నారు.

ఎంత పొరపడ్డాం మిత్రమా..! ఆ విషయంలో మనుషుల వల్లే జంతువులకు డేంజర్‌ అట..? తాజా అధ్యయనంలో వెల్లడి
Transmissions Of Viruses
Jyothi Gadda
|

Updated on: Apr 05, 2024 | 7:21 AM

Share

అనేక రకాలైన వ్యాధులకు కారణమయ్యే ఎన్నో వైరస్‌లు, బ్యాక్టీరియాలు మన చుట్టూ ఉన్నాయి. అలాగే, ఎలుకలు, గబ్బిలాలు వంటి జంతువులు ఈ వైరస్‌లు, బ్యాక్టీరియాలను వ్యాప్తి చేస్తున్నాయని ఎంతో కాలంగా నమ్ముతున్నాం. అయితే ఇప్పుడు తాజా అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడి చేసింది. ఈ కొత్త అధ్యయనం ప్రకారం, మనవల్లనే జంతువులకు ఎక్కువ వైరస్​లు వ్యాప్తి చెందుతాయని తాజాగా అధ్యయనం తెలిపింది.జంతువుల నుంచి మనిషి వచ్చే వైరస్‌, బ్యాక్టిరీయాల కంటే మనం నోరులేని ఆ జీవాలకు వ్యాపింపజేసే వైరస్ రెండింతలు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. జంతువుల్లో ఇంతటి ప్రమాదానికి కారణం అవుతున్న మానవులు నిజానికి పెద్ద ముప్పు. ఈ తాజా అధ్యయనం గురించి వివరంగా తెలుసుకుందాం-

యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో నిర్వహించిన ఈ తాజా పరిశోధనలో విస్తూ పోయే విషయాలు వెల్లడించారు. వైరస్​ జన్యువుల విశ్లేషణలో మానవులు, ఇతర జంతువుల మధ్య ఉన్న వైరస్‌లపై అధ్యయనం చేసినప్పుడు.. 64 శాతం కేసులలో మానవుల నుంచే ఇతర జంతువులకు వైరస్​ సోకినట్లు పరిశోధకులు గుర్తించారు. జంతువులు ఇచ్చే వైరస్‌​ల కంటే.. మనం వాటికి ఎక్కువ వైరస్‌లను ఇస్తామని కాలేజ్ ప్రొఫెసర్ సెడ్రిక్ టాన్ వెల్లడించారు. ఈ అధ్యయనంలో గ్లోబల్ డేటాబేస్‌​ను ఉపయోగించారు. వైరస్‌​లు ఎలా వ్యాపిస్తున్నాయనే దానిపై అధ్యయనం చేసి కీలక విషయాలు వెల్లడించారు. మనుషులు చేసే అనేక కార్యకలాపాలు ఈ వైరస్‌ల వ్యాప్తికి దోహదం చేస్తాయి. మానవులచే నిరంతర నివాస విధ్వంసం, వేగంగా పెరుగుతున్న కాలుష్యం జంతువులపై తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుందన్నారు. అయితే మానవుల నుంచి ఇతర జంతువులకు వ్యాపించే వైరస్‌ల కారణంగా చాలా జీవులు అంతరించిపోతున్నాయనే ఆందోళనకర విషయాన్ని పరిశోధకులు తెలిపారు. హ్యూమన్ రెస్పిరోవైరస్ వ్యాప్తి కారణంగా ఉగాండలోని అనేక అడవి చింపాంజీలు చనిపోయాయని తెలిపారు.

నిపుణుల అభిప్రాయం ఏమిటంటే..? జంతువులు మరియు మానవుల మధ్య వైరస్‌ల ప్రసారాన్ని సర్వే చేయడం, పర్యవేక్షించడం ద్వారా, వైరల్ పరిణామాన్ని బాగా అర్థం చేసుకోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. దీనితో భవిష్యత్తులో ప్రాణాంతక వైరస్‌ల వ్యాప్తిని అధ్యయనం చేయడానికి, కొత్త వ్యాధులు, అంటువ్యాధుల కోసం మనం మరింత అప్రమత్తంగా ఉండేలా సిద్ధం చేసుకోగలమని భావిస్తున్నారు. అదే సమయంలో ఈ పరిశోధన ప్రధాన రచయిత, పీహెచ్‌డీ పండితుడు సెడ్రిక్ టాన్ మాట్లాడుతూ, వైరస్‌లు మానవుల నుండి జంతువులకు చేరినప్పుడు, అది జంతువులకు హాని కలిగించడమే కాకుండా జాతులకు, ఆ జాతి పరిరక్షణ ముప్పును కూడా కలిగిస్తుందన్నారు. దాంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. అదనంగా, మానవులు ప్రవేశపెట్టిన కొత్త వైరస్ జంతు జాతులకు సోకినట్లయితే, వైరస్ మానవుల నుండి తొలగించబడిన తర్వాత కూడా అవి జీవించి ఉండే అవకాశం ఉంటుంది. అవే తిరిగి మళ్లీ కొత్త జాతులుగా రూపాంతరం చెంది మానవులకు సోకే ప్రమాదం కూడా తప్పక పొంచి ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..