Gigantic Ocean: భూమి అడుగున మహా సముద్రం.! 700 కి.మీ. అడుగున సముద్రాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.

భూమి మూడు పొరలుగా ఉంటుందని.. వాటిని క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అంటారని మనం చదువుకున్నాం. తాజాగా పరిశోధకులు ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు. భూమికి సుమారు 700 కిలోమీటర్ల అడుగున ఓ అతిపెద్ద మహాసముద్రం ఉందని గుర్తించారు! ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రింగ్వుడైట్ అనే రాయి లోపల భారీ స్థాయిలో నీరు దాగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

Gigantic Ocean: భూమి అడుగున మహా సముద్రం.! 700 కి.మీ. అడుగున సముద్రాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.

|

Updated on: Apr 04, 2024 | 10:05 PM

భూమి మూడు పొరలుగా ఉంటుందని.. వాటిని క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అంటారని మనం చదువుకున్నాం. తాజాగా పరిశోధకులు ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు. భూమికి సుమారు 700 కిలోమీటర్ల అడుగున ఓ అతిపెద్ద మహాసముద్రం ఉందని గుర్తించారు! ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రింగ్వుడైట్ అనే రాయి లోపల భారీ స్థాయిలో నీరు దాగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. మొత్తం భూమిపై ఉన్న మహాసముద్రాల్లో ఉన్ననీటి కంటే 3 రెట్లు ఎక్కువ నీరు అందులో ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీహైడ్రేషన్ మెల్టింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద లోవర్ మ్యాంటిల్ అనే పేరుతో ఓ పరిశోధన పత్రంలో పొందుపరిచారు. రింగ్వుడైట్ ప్రత్యేక లక్షణాల గురించి అందులో వివరించారు. రింగ్వుడైట్ రాయి ఒక స్పాంజిలాగా నీటిని పీల్చుకుంటోంది. దీని నిర్మాణం ప్రత్యేకంగా ఉందని, హైడ్రోజన్ ను ఆకర్షించడం ద్వారా ఇది నీటిని పట్టి ఉంచుతోందన, ఈ పరిశోధన బృందంలో కీలకపాత్ర పోషించిన జియోఫిసిసిస్ట్ స్టీవ్ జాకబ్ సన్ పేర్కొన్నారు. మొత్తం భూమిపై నీటి చక్రం ఏర్పడటానికి గల ఆధారాన్ని ఇప్పుడు చూడగలుగుతున్నామని ఆయన వివరించారు. ఈ పరిణామం భూమిపై భారీ స్థాయిలో నీరు ఎలా వచ్చిందో తెలియజేపస్తుందన్నారు. భూమి పొరల్లో దాగి ఉన్నఈ నీటి జాడ కోసం శాస్ర్తవేత్తలంతా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు.

వివిధ భూకంపాలపై అధ్యయనం చేపట్టిన తర్వాత పరిశోధకులు భూమి అడుగున నీటి జాడను కనుగొన్నారు. భూకంపాలను కొలిచే సీస్మోమీటర్లు భూమి అడుగున షాక్ వేవ్స్ ను గుర్తించడంతో నీటి జాడ గురించి బయటపడింది. భూమి మ్యాంటిల్ మార్పిడి జోన్ లోని ఖనిజాల్లో భారీ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం ఉందంటే దాని అర్థం భారీ నీటి జలాశయం ఉందన్నమాటే. మ్యాంటిల్ భాగంలో నిట్టనిలువునా పారే నీరు ఎండిపోవడానికి ఇది దారితీయొచ్చు అని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
Latest Articles
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్.. ఊ అంటావా మావాకు మాస్ స్టెప్పులు..
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్.. ఊ అంటావా మావాకు మాస్ స్టెప్పులు..
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు
వైరల్ అవుతున్న మహేష్ హెయిర్ స్టైల్
వైరల్ అవుతున్న మహేష్ హెయిర్ స్టైల్