America: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి దుర్మరణం.!
అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి దుర్మరణం చెందాడు. బాపట్ల జిల్లాలకు చెందిన విద్యార్ధి ఉన్నత చదవుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన కుమారుడి మృతితో తండ్రి శోకసంద్రంలో మునిగిపోయారు. పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్ బీటెక్ పూర్తి చేసుకుని ఎంఎస్ అభ్యసించేందుకు గత ఏడాది డిసెంబరు చివరిలో అమెరికా వెళ్లాడని బంధువులు తెలిపారు.
అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి దుర్మరణం చెందాడు. బాపట్ల జిల్లాలకు చెందిన విద్యార్ధి ఉన్నత చదవుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన కుమారుడి మృతితో తండ్రి శోకసంద్రంలో మునిగిపోయారు. పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్ బీటెక్ పూర్తి చేసుకుని ఎంఎస్ అభ్యసించేందుకు గత ఏడాది డిసెంబరు చివరిలో అమెరికా వెళ్లాడని బంధువులు తెలిపారు. మాడిసన్ ప్రాంతంలోని డకోట స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్లు చెప్పారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు స్నేహితులతో కలసి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు కారులో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వాతావరణంలో పెనుమార్పులతో ఒక్కసారిగా పొగ మంచు కమ్ముకుని, కారు అదుపుతప్పినట్లు తెలిసిందన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులతో పాటు రేవంత్‌కు తీవ్ర గాయాలవ్వగా, రేవంత్ దుర్మరణం చెందినట్లు సమాచారం అందిందన్నారు. దీంతో బోడవాడలో తీవ్ర విషాదం అలముకుంది. రేవంత్ తల్లి కొన్నాళ్ల క్రితం మరణించగా, అతని తండ్రి ఆచంట రఘుబాబు ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.