Telangana: రామాయణంతో ముడిపడి ఉన్న కరీంనగర్ కుర్రాడి ప్రేమకథ.. విషయం ఏంటంటే..

హైందవ ఆచార వ్యవహారాల ప్రకారం నిర్వహించిన వివాహంతో సురేందర్, జాను శిఖలు ఒక్కటయ్యారు. అయితే రామాయణంలో రావణుడి రాజ్యమైన శ్రీలంకకు చెందిన యువతి... అరణ్య వాసం చేసినప్పుడు శ్రీరాముడు నడియాడిన నేల అయిన రామడుగుకు చెందిన యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం యాధృచ్ఛికంగా జరిగినప్పటికీ..

Telangana: రామాయణంతో ముడిపడి ఉన్న కరీంనగర్ కుర్రాడి ప్రేమకథ.. విషయం ఏంటంటే..
Telangana Boy And Sri Lankan Girl
Follow us
G Sampath Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Apr 04, 2024 | 2:02 PM

లండన్ లో ప్రేమించుకున్న ఆ వధువు రాముడుగులోని మెట్టినింటకు వచ్చి చేరింది. ప్రేమించుకున్న ఆ ఇద్దరు కూడా ఈ ప్రత్యేకతలను గమనించకపోవచ్చు కానీ.. అనుకోకుండానే ఏర్పడిన ఈ ఆత్మీయ బంధం మాత్రం ఏడడుగులు… మూడు ముళ్లు… నూరేళ్ల జీవితంతో పెనవేసుకుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవారం వివాహంతో ఒక్కటైన ఆ ప్రేమ జంట ఎన్నెన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పందుకుంటపల్లికి చెందిన కటుకం సురేందర్ ఉపాధి కోసం లండన్ లో స్థిరపడ్డాడు.  2018 నుండి అక్కడే ఉద్యోగం చేస్తున్న సురేందర్ కు శ్రీలంకకు చెందిన జాను శిఖతో పరిచయం ఏర్పడింది.

ఈ ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమ వరకు చేరింది. మనసులు కలిసిన వీరద్దరు వైవాహిక బంధంతో జీవితాంతం కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వీరిద్దరు కూడా తమ కుటుంబాల్లోని పెద్దలకు చెప్పి ఒప్పించారు. ఇరు కుటుంబాలకు చెందిన వారు కూడా సురేందర్, జానుశిఖల కోరికలను ఆశీర్వదించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అందరి ఆమోదంతో జరిగిన ఈ పెళ్లి వేడుకను కరీంనగర్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు. వధూవరులను మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా ఆశీర్వదించారు.

మెట్టినింటి సాంప్రదాయంతో…

ఇవి కూడా చదవండి

సురేందర్ జీవిత భాగస్వామిగా ఉండాలని నిర్ణయించుకున్న జాను శిఖ మెట్టినింటి సాంప్రదాయలను కూడా గౌరవించారు. సురేందర్ పూర్వీకుల నుండి సాంప్రదాయబద్దంగా సాగుతున్న తీరుకు అనుగుణంగా పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం విశేషం. దీంతో హైందవ ఆచార వ్యవహారాల ప్రకారం నిర్వహించిన వివాహంతో సురేందర్, జాను శిఖలు ఒక్కటయ్యారు. అయితే రామాయణంలో రావణుడి రాజ్యమైన శ్రీలంకకు చెందిన యువతి… అరణ్య వాసం చేసినప్పుడు శ్రీరాముడు నడియాడిన నేల అయిన రామడుగుకు చెందిన యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం యాధృచ్ఛికంగా జరిగినప్పటికీ ఈ ప్రత్యేకతలు కూడా వారు సొంతం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి