Telangana: వాటర్‌ ట్యాంకులో పడి 30 కోతులు మృతి.. వారిపై కేసు నమోదు

వేసవి కాలంలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఎంత తీవ్రత పెరిగిపోతుండటంతో జనాలు అల్లాడిపోతున్నారు. అలాగే పశువులు, పక్షులు, జంతువులు సైతం ఎంత తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాయి. వేసవి తాపాన్ని సేద తీరేందుకు నీటి కుంటలు, చెరవులు, ఇతర ప్రాంతాలను ఆశ్రయిస్తున్నాయి. ఇక కోతులు సైతం గ్రామాల్లోని పరిసర ప్రాంతాలు, నీటి ట్యాంకుల వద్దకు చేరుకుని ఎండ తాపం నుంచి రక్షించుకుంటున్నాయి...

Telangana: వాటర్‌ ట్యాంకులో పడి 30 కోతులు మృతి.. వారిపై కేసు నమోదు
Monkeys
Follow us

|

Updated on: Apr 04, 2024 | 1:18 PM

వేసవి కాలంలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఎంత తీవ్రత పెరిగిపోతుండటంతో జనాలు అల్లాడిపోతున్నారు. అలాగే పశువులు, పక్షులు, జంతువులు సైతం ఎంత తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాయి. వేసవి తాపాన్ని సేద తీరేందుకు నీటి కుంటలు, చెరవులు, ఇతర ప్రాంతాలను ఆశ్రయిస్తున్నాయి. ఇక కోతులు సైతం గ్రామాల్లోని పరిసర ప్రాంతాలు, నీటి ట్యాంకుల వద్దకు చేరుకుని ఎండ తాపం నుంచి రక్షించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని నల్గొండ జిల్లాలో బుధవారం వాటర్ ట్యాంక్‌లో సుమారు 30 కోతులు మృతి చెందాయి.

నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జున సాగర్ సమీపంలోని వాటర్ ట్యాంక్ నుంచి కోతుల మృతదేహాలను మున్సిపల్ కార్మికులు బయటకు తీశారు. హిల్‌కాలనీలోని సుమారు 200 కుటుంబాలకు తాగునీరు అందించేందుకు వాటర్‌ ట్యాంక్‌ను వినియోగించగా, మున్సిపల్‌ సిబ్బంది దాని పైన మెటల్‌ షీట్లు వేశారు. ఎండవేడిమి కారణంగా కోతులు నీటి కోసం మెటల్ షీట్ల ద్వారా ట్యాంకులోకి ప్రవేశించి బయటకు రాలేక నీటిలో మునిగిపోయి చనిపోయి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ట్యాంకు నుంచి దుర్వాసన రావడంతో ఆ ప్రాంత వాసులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో మున్సిపాలిటీ సిబ్బంది ట్యాంక్‌ వద్దకు వచ్చి పరిశీలించగా, కోతులు చనిపోయినట్లు గుర్తించారు.  ఇదిలా ఉండగా, వాటర్ ట్యాంక్ లో వానరాలు మృతి చెందిన ఘటనలో పోలీసుల కొరడా ఝులిపించారు. ఏఈ భిక్షమయ్య సిబ్బంది వెంకటేశ్వర్లు, నర్సింహా పై ఐపీసీ సెక్షన్ 269 కింద కేసు నమోదు చేశారు.

ఇంత పెద్ద సంఖ్యలో కోతుల మృత దేహాలు బయటపడిన తర్వాత అదే నీటిని తాగడంతో వాటి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్