KTR: భారత్‌లో టెస్లా కార్ల తయారీ ప్లాంట్.. తెలంగాణ సర్కార్‌కు విజ్ఞప్తి చేసిన కేటీఆర్
ప్రముఖం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా.. భారత్‌లో2 బిలియన్ డాలర్ల నుండి 3 బిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అమెరికా నుంచి టెస్లా కంపెనీ టీమ్ త్వరలో భారత్‌కు రానుంది. టెస్లా బృందం భారత్‌కు వస్తున్న సందర్భంలో తెలంగాణ మాజీ..
ప్రముఖం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా.. భారత్‌లో2 బిలియన్ డాలర్ల నుండి 3 బిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అమెరికా నుంచి టెస్లా కంపెనీ టీమ్ త్వరలో భారత్‌కు రానుంది. టెస్లా బృందం భారత్‌కు వస్తున్న సందర్భంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ప్లాంట్‌ను తెలంగాణకు తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. టెస్లా ప్రతినిధులను మన రాష్ట్రానికి తీసుకొచ్చి.. ఇక్కడ కార్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టెస్లా బృందం హైదరాబాద్‌ను సందర్శించి ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ కోసం పరిశీలించేలా చర్యలు చేపట్టాలన్నారు.
Request Telangana Government to go all out and do your best to bring them to our state
Make sure Tesla team visits Hyderabad and understands the progressive industrial policies of Telangana Government https://t.co/luSblzxgn7
— KTR (@KTRBRS) April 4, 2024
తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అద్భుతమైన అవకాశాలతో పాటు ప్రోగ్రెసివ్ పారిశ్రామిక విధానాలను కంపెనీకి తెలియజేసి, హైదరాబాద్ నగరంలో టెస్లా బృందం పర్యటించేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కంపెనీని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తన శక్తి యుక్తులను అన్నిటిని ఉపయోగించి ప్రయత్నం చేయాలని కోరారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి