Telangana: “కేసు నా మీద కాదు పోలీసుల మీద పెట్టండి”.. హైకోర్ట్‌లో మాజీ ఎమ్మెల్యే కొడుకు కీలక వాదన
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాగుట్ట రాష్ డ్రైవింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన తర్వాత తనకు బదులుగా తన డ్రైవర్‌ను పోలీసుల ముందు లొంగిపోమని చెప్పి ఆ తర్వాత దుబాయ్ పారిపోయాడు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాగుట్ట రాష్ డ్రైవింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన తర్వాత తనకు బదులుగా తన డ్రైవర్‌ను పోలీసుల ముందు లొంగిపోమని చెప్పి ఆ తర్వాత దుబాయ్ పారిపోయాడు. దీంతో షకీల్ కొడుకుతో పాటు అతడు దుబాయ్ వెళ్లినందుకు సహకరించిన 12 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగి మూడు నెలలు కావస్తున్న ఇప్పటివరకు షకిల్ కొడుకు ఇండియాకు రాలేదు. దీంతో పోలీసులు అతడి మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
అయితే పోలీసుల లుక్ అవుట్ నోటీసులు సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కొడుకు రాహిల్ హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై పోలీసులు జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులు రద్దు చేయాలని కోరాడు. తాను పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని హైకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే, ఈ కేసును పోలీసులు అనవసరంగా రాద్ధాంతం చేశారని, రాత్రి సమయం కావడంతో తనకు అక్కడ భారీకేడ్ కనిపించలేదని పిటిషన్ లో తెలిపాడు. ఇందులో ఎలాంటి ప్రాణ నష్టం లేకున్నా పోలీసులు కావాలని కేసును పెద్దది చేశారని, అసలు ముందు కేసు పెట్టాలంటే పోలీసులు మీదే కేసు పెట్టాలని పిటిషన్ లో మాజీ ఎమ్మెల్యే కొడుకు తెలిపాడు. రాత్రి సమయంలో రోడ్డుకు అడ్డంగా భారీకేడ్లు వేశారని, అయితే ఎలాంటి సిగ్నలింగ్ పోలీసులు అక్కడ ఏర్పాటు చేయలేదని, దీనికి పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ ముందు పోలీసుల మీద కేసు పెట్టాలని పిటిషన్ లో పేర్కొన్నాడు.
ఈ కేసులో ఇప్పటికే పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు సస్పెండ్ అయ్యారు. రాహిల్‌ను తప్పించి విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఏకంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది 87 మందిని హైదరాబాద్ కమిషనర్ బదిలీ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా మాజీ ఎమ్మెల్యే కొడుకుపై మరో కేసులు ఓపెన్ చేశారు వెస్ట్ జోన్ హైదరాబాద్ పోలీసులు. మూడు సంవత్సరాల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో రోడ్డు ప్రమాదం కేసును రీ ఓపెన్ చేశారు. అప్పుడు కూడా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసిన కారణంగా ఒక బాలుడు మృతితోపాటు ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పుడు కూడా కారు నడిపింది ఎమ్మెల్యే కొడుకు రాహిల్ అని పోలీసులు తాజాగా నిర్ధారించారు. అప్పుడు కూడా తన డ్రైవర్‌గా ఉన్న ఆఫీఫ్ అనే వ్యక్తి లొంగిపోవడంతో పోలీసుల ఆతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చూడాలి మరీ ఈ కేసు ఇంకా ఎన్నిక మలుపు తిరుగుతుందో..!
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…