Viral Video: అనారోగ్యంతో వృద్దుడు మృతి.. రెండు రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. చివరికి..!

ఖమ్మం జిల్లాలో హృదయవిదారకర ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్య లేదు.. రక్తం పంచుకున్న వారసులు లేరు. 85 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఒక వృద్దుడు మృతి చెందాడు. రెండు రోజులుగా దహన సంస్కారాలు చేసే వారు లేక ఇంటిలోనే మృతదేహం ఉండిపోయింది. చనిపోయిన వృద్ధుడికి దహన సంస్కారాలు చేసేందుకు గ్రామస్తులు, కులస్తులు ముందుకు రాకపోవడంతో తోడబుట్టిన అన్నకు ఇద్దరు చెల్లెళ్ళు అంతిమ సంస్కారాలు చేశారు.

Viral Video: అనారోగ్యంతో వృద్దుడు మృతి.. రెండు రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. చివరికి..!
Old Man Funerals
Follow us
N Narayana Rao

| Edited By: Balaraju Goud

Updated on: Apr 04, 2024 | 11:31 AM

ఖమ్మం జిల్లాలో హృదయవిదారకర ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్య లేదు.. రక్తం పంచుకున్న వారసులు లేరు. 85 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఒక వృద్దుడు మృతి చెందాడు. రెండు రోజులుగా దహన సంస్కారాలు చేసే వారు లేక ఇంటిలోనే మృతదేహం ఉండిపోయింది. చనిపోయిన వృద్ధుడికి దహన సంస్కారాలు చేసేందుకు గ్రామస్తులు, కులస్తులు ముందుకు రాకపోవడంతో తోడబుట్టిన అన్నకు ఇద్దరు చెల్లెళ్ళు అంతిమ సంస్కారాలు చేశారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామంలో హృదయవిదారకర ఘటన వెలుగులోకి వచ్చింది. జల్లి ముత్యాలు (85) అనే వృద్దుడు అనారోగ్యంతో మంచన పడి మృతి చెందాడు. అతనికి భార్య లేదు, రక్తం పంచుకు పుట్టిన వారసులు కూడా లేరు. ముత్యాలు చనిపోవడంతో దహన సంస్కారాలు చేసేందుకు గ్రామస్తులు, కులస్తులు ముందుకు వచ్చేందుకు నిరాకరించారు. అనారోగ్యంతో మృతి చెందిన వృద్దుడు ముత్యాలుకు ఒక 40 లక్షలు విలువ చేసే స్థిరాస్తి ఉంది. కానీ తన అంత్యక్రియలు చేసేందుకు ఒక్కరూ దయచూపలేదు. చివరికి గ్రామస్తులను ఎదురించి చెల్లెళ్ళు ముందుకు వచ్చారు.

కుల పెద్దలు అంత్యక్రియలు చెయ్యాలంటే కొంత నగదు చెల్లించాలని డిమాండ్ చేయడంతో వేరే దారలేక మృతుడి జల్లి ముత్యాలు తొడబుట్టిన ఇద్దరు చెల్లెళ్ళు దహన సంస్కారాలు చేయడం జరిగింది. అతని అంత్యక్రియలు నిర్వర్తించేందుకు తమ కులస్తులు సహరించలేదని, తమ కుటుంబానికి బహిష్కరించారని చెల్లెళ్ళు వాపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…