Skin Care Tips: మహిళల కోసం అదిరిపోయే స్కిన్ కేర్ టిప్స్.. 30లలో కూడా మిళమిళలాడే అందం మీ సొంతం..!

ముఖంపై ఏర్పడ్డ మృతకణాలను తొలగించడానికి, అంతర్గత పోషణ, ఆర్ద్రీకరణను అందించడానికి స్క్రబ్బింగ్ అవసరం. ఇందుకోసం మీరు ఇంట్లోనే సహజసిద్ధమైన స్క్రబ్‌ని తయారు చేసుకుని, స్వయంగా స్క్రబ్ చేయడం ద్వారా మంచి గ్లో పొందవచ్చు. అలాంటి కొన్ని హోంమేడ్ స్క్రబ్స్ గురించి తెలుసుకుందాం-

Skin Care Tips: మహిళల కోసం అదిరిపోయే స్కిన్ కేర్ టిప్స్.. 30లలో కూడా మిళమిళలాడే అందం మీ సొంతం..!
Glowing Skin
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 05, 2024 | 8:00 AM

వేసవిలో తరచూగా ఫేస్‌ డల్ గా ఉండటం, ముడతలు, మచ్చలు అనేవి సాధారణంగా వచ్చే సమస్య. ఇది తరచుగా మన ముఖంలోని మెరుపును మాయం చేస్తుంది. నానాటికీ పెరుగుతున్న కాలుష్యం, మన అజాగ్రత్త కారణంగా మన చర్మం దెబ్బతింటుంది. దానికి పరిష్కారం కోసం అనేక సౌందర్య సంరక్షణ ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. ఫలితంగా అవి మన చర్మాన్ని మరింత పాడు చేస్తాయి. అందుకే చర్మం సహజంగా మెరిసేలా చేయడానికి కొన్ని ఇంటి నివారణలు ఉపయోగపడతాయి. ముఖంపై ఏర్పడ్డ మృతకణాలను తొలగించడానికి, అంతర్గత పోషణ, ఆర్ద్రీకరణను అందించడానికి స్క్రబ్బింగ్ అవసరం. ఇందుకోసం మీరు ఇంట్లోనే సహజసిద్ధమైన స్క్రబ్‌ని తయారు చేసుకుని, స్వయంగా స్క్రబ్ చేయడం ద్వారా మంచి గ్లో పొందవచ్చు. అలాంటి కొన్ని హోంమేడ్ స్క్రబ్స్ గురించి తెలుసుకుందాం-

కాఫీ, కొబ్బరి నూనె స్క్రబ్:

కొబ్బరి నూనెలో కాఫీ పౌడర్ మిక్స్ చేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేసి కొంత సమయం తర్వాత స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. కొబ్బరి నూనె ముఖానికి తేమను నిర్వహిస్తుంది. కాఫీ ముఖ ఛాయను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆరెంజ్ పీల్, అలోవెరా జెల్, హనీ స్క్రబ్:

విటమిన్ సి ముఖ ఛాయను మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది ముఖానికి అంతర్గత పోషణను అందించడంలో కూడా సహాయపడుతుంది. ఇందుకోసం నారింజ తొక్క, అలోవెరా జెల్, తేనె వేసుకుని బాగా మిక్స్ చేసి ముఖానికి స్క్రబ్ చేయాలి.

వోట్మీల్, పెరుగు స్క్రబ్:

రెండు చెంచాల ఓట్ మీల్ లో ఒక చెంచా పెరుగు మిక్స్ తీసుకుని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ముఖాన్ని లోపలి నుండి హైడ్రేట్ గా ఉంచడంలో పెరుగు సహాయపడుతుంది.

బాదం, వాల్నట్, తేనె స్క్రబ్:

నానబెట్టిన బాదం, వాల్ నట్స్ ను మెత్తగా గ్రైండ్ చేసి అందులో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. బాదం, వాల్‌నట్స్‌లో ఉండే విటమిన్ ఇ ముఖానికి పోషణ అందించడం ద్వారా ఛాయను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బొప్పాయి, చక్కెర, నిమ్మరసం స్క్రబ్:

బొప్పాయి, పంచదార పొడిలో ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి దానితో మీ ముఖాన్ని స్క్రబ్ చేయండి.

తేనె, బ్రౌన్ షుగర్ స్క్రబ్:

షుగర్, బ్రౌన్ షుగర్ రెండూ ముఖం తేమను కలిగించడంలో అలాగే మృతకణాలను తొలగించడంలో సహాయపడతాయి. ఛాయను మెరుగుపరుస్తాయి.

నిమ్మరసం, చక్కెర స్క్రబ్:

నిమ్మరసంలో చక్కెర మిక్స్ చేసి ముఖానికి స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.

అలోవెరా జెల్, బేకింగ్ సోడా స్క్రబ్:

అలోవెరా జెల్‌లో బేకింగ్ సోడా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ