Coconut Water: వేసవి దాహార్తిని తీర్చే కొబ్బరి నీరు.. ఈ సమస్యలున్నవారు తాగితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే..
కొబ్బరి నీరుని తాగడం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించుకోవచ్చు. కొబ్బరి నీళ్లలో చాలా విటమిన్లు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది విటమిన్ సి. ఈ విటమిన్ మన చర్మాన్ని సూర్యరశ్మి, వేడి నుండి కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. వేసవిలో ప్రతి ఒక్కరూ దీన్ని తాగవచ్చని ప్రజలు నమ్ముతారు. కొబ్బరి నీరు గుణాల నిధి అయినప్పటికీ.. కొంతమంది కొబ్బరి నీరుని తాగడం మానుకోవాలి. కొబ్బరి నీళ్లను తీసుకోవడం కొంత మందికి సమస్యగా మారవచ్చు. జైపూర్‌కు చెందిన డైటీషియన్ సుర్భి పరీక్, TV9 తో మాట్లాడుతూ కొబ్బరి నీళ్లకు కొంతమంది దూరంగా ఉండాలని చెప్పారు
వేసవి కాలంలో కొబ్బరి నీళ్లును ఎంతో ఇష్టంగా తాగుతారు. ఎందుకంటే ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. నీటి లోపాన్ని దూరం చేసే కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎలక్ట్రోలైట్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. కనుక కొబ్బరి నీరుని తాగడం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించుకోవచ్చు. కొబ్బరి నీళ్లలో చాలా విటమిన్లు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది విటమిన్ సి. ఈ విటమిన్ మన చర్మాన్ని సూర్యరశ్మి, వేడి నుండి కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. వేసవిలో ప్రతి ఒక్కరూ దీన్ని తాగవచ్చని ప్రజలు నమ్ముతారు. కొబ్బరి నీరు గుణాల నిధి అయినప్పటికీ.. కొంతమంది కొబ్బరి నీరుని తాగడం మానుకోవాలి.
కొబ్బరి నీళ్లను తీసుకోవడం కొంత మందికి సమస్యగా మారవచ్చు. జైపూర్‌కు చెందిన డైటీషియన్ సుర్భి పరీక్, TV9 తో మాట్లాడుతూ కొబ్బరి నీళ్లకు కొంతమంది దూరంగా ఉండాలని చెప్పారు. ఈ రోజున ఎవరు కొబ్బరి నీరుకి తాగడం మంచిది కాదో తెలుసుకుందాం..
కొబ్బరి నీరులో పోషకాలు మెండు
కొబ్బరి నీరు పొటాషియానికి ఉత్తమ వనరుగా పరిగణించబడుతుంది. అంతేకాదు మెగ్నీషియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్ వంటి పోషకాలు కూడా ఇందులో లభిస్తాయి. విశేషమేమిటంటే ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. కొబ్బరి నీరులో పిండి పదార్థాలు , సహజ చక్కెరను కూడా ఉన్నాయి. కొబ్బరి నీరు మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఎవరికైనా బీపీ పెరుగుతూ ఉంటే వారు కూడా ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని తాగాలి. ఎందుకంటే ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా కొబ్బరి నీరు ఎనర్జిటిక్ గా ఉండటానికి సహాయపడుతుంది.
కొబ్బరి నీరుకి కొంతమంది దూరంగా ఉండాలి.. ఎందుకో తెలుసా…
కిడ్నీ రోగులు
ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగకూడదని డైటీషియన్ సురభి పరీక్ చెబుతున్నారు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. కొబ్బరి నీళ్ల వల్ల కిడ్నీలో పొటాషియం స్థాయి పెరిగి ఈ అవయవం ఫిల్టర్ చేయలేకపోతుందని అంటున్నారు. దీని కారణంగా కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎవరైనా శరీరంలో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉంటే నిపుణుల సలహా మేరకు మాత్రమే కొబ్బరి నీళ్లను తాగాలని నిపుణులు చెబుతున్నారు. అధిక పొటాషియం కారణంగా కొంతమంది శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను ఎదుర్కోవలసి ఉంటుంది.
అలర్జీలతో బాధపడుతున్న వారు
సుర్భి పరీక్ చెప్పిన ప్రకారం ఎవరైనా కొబ్బరికి అలెర్జీ కలిగి ఉంటే అతను కొబ్బరి నీళ్ళు తాగకుండా ఉండాలి. అంతేకాదు ఇప్పటికే ఏ రకమైన అలెర్జీతో బాధపడుతూ ఉన్నట్లయితే నిపుణుల సలహాపై మాత్రమే కొబ్బరి నీటిని తాగాల్సి ఉంది.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
కొబ్బరి నీళ్లు తాగేవారు కొన్ని తప్పులు పునరావృతం చేస్తారు. ప్యాక్ చేసిన లేదా ఫ్రిజ్‌లో ఉంచిన కొబ్బరి నీళ్లను తాగడం మానుకోవాలని నిపుణులు సురభి అంటున్నారు. కొబ్బరి నీరు త్రాగడానికి సరైన సమయం మధ్యాహ్నం. బరువు తగ్గడానికి ఖాళీ కడుపుతో త్రాగాలనుకుంటే.. నిపుణుల సలహా తీసుకోకుండా ఈ పద్ధతిని ప్రయత్నించకండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..