Ginger Benefits: ఇంటిప్స్.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిన్న అల్లం ముక్క తిన్నారంటే!
ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్య కరమైన అలవాట్లు అలవరచుకోవాలి. ఫలితంగా ఎలాంటి వ్యాధి శరీరంలో గూడు కట్టుకోకుండా నివారించవచ్చు. అందుకు ఖరీదైన ఆహారాలు తీసుకోవల్సిన అవసరం లేదు. వంటిట్లో ఉండే అల్లంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. తల తిరగడం నుంచి వికారం వరకు, జీర్ణ సమస్యలు, గ్యాస్ హార్ట్ బర్న్ సమస్యలు వంటి మరెన్నో ఆరోగ్య రుగ్మతలకు అల్లంలో చెక్ పెట్టవచ్చు. అల్లం ఔషధం కంటే తక్కువ కాదు. ఎందుకంటే దీనిలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి..
Updated on: Apr 04, 2024 | 9:27 PM

ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్య కరమైన అలవాట్లు అలవరచుకోవాలి. ఫలితంగా ఎలాంటి వ్యాధి శరీరంలో గూడు కట్టుకోకుండా నివారించవచ్చు. అందుకు ఖరీదైన ఆహారాలు తీసుకోవల్సిన అవసరం లేదు. వంటిట్లో ఉండే అల్లంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

తల తిరగడం నుంచి వికారం వరకు, జీర్ణ సమస్యలు, గ్యాస్ హార్ట్ బర్న్ సమస్యలు వంటి మరెన్నో ఆరోగ్య రుగ్మతలకు అల్లంలో చెక్ పెట్టవచ్చు. అల్లం ఔషధం కంటే తక్కువ కాదు. ఎందుకంటే దీనిలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొలస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ సహాయపడతాయి.

కాబట్టి అల్లంతో తయారు చేసిన టీతో రోజు ప్రారంభిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం ముక్క తిన్నా లాభం ఉంటుందట.

అల్లం వివిధ జీర్ణ వ్యాధులను నయం చేస్తుంది. గర్భిణీ స్త్రీలు తరచుగా అల్లం నీటిని తాగితే పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అల్లం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీంతో డయాబెటీస్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

గ్యాస్, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారించడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు జీర్ణ సమస్యలు ఉంటే, ఈ రోజు నుంచే అల్లం తినడం ప్రారంభించండి. అంతేకాకుండా శరీరాన్ని, మెదడును నిర్మించడంలో సహాయపడే బహుళ పోషకాలు, బయోయాక్టివ్ పదార్థాలు అల్లంలో ఉన్నాయి. విడిగా తినలేకపోతే వంటల్లో వినియోగించినా ఫలితం ఉంటుంది. కాబట్టి జబ్బులు రాకుండా ఉండాలంటే ఉదయాన్నే అల్లం తినడం అలవాటు చేసుకోవాలి మరి.





























