AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఒడిలో చంటిబిడ్డతో రోడ్డు పక్కన కూర్చున్న తల్లి..! ఏం చేస్తుందో చూడండి..

ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు..అమ్మ ప్రేమ దొరికిన వాడు ఎప్పటికీ పేదవాడు కాదు సార్..అని రాశారు. అదే సమయంలో మరొక వినియోగదారు ఏ తల్లి పేదది కాదు అని రాశారు. చాలా మంది వినియోగదారులు హార్ట్‌ ఎమోజీలతో వీడియోని షేర్ చేసారు.

Watch Video: ఒడిలో చంటిబిడ్డతో రోడ్డు పక్కన కూర్చున్న తల్లి..! ఏం చేస్తుందో చూడండి..
Motherhood
Jyothi Gadda
|

Updated on: Apr 05, 2024 | 11:51 AM

Share

ప్రపంచంలో తల్లి ప్రేమను మించినది ఏదీ లేదు.. తల్లి అందించే ప్రేమ, ఆప్యాయతను ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు. దీనికి సంబంధించిన అనేక ఉదాహరణలు మనం ప్రతినిత్యం చూస్తూనే ఉంటాం. అమ్మ ప్రేమను చూపించే అనేక వీడియోలు, సంఘటనలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో కూడా అనేకం కనిపిస్తుంటాయి. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక తల్లి తన బిడ్డ కోసం ఏదైనా సరే చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎంతటి కష్టం ఎదురైనా ఎదుర్కొంటుంది. అలాంటిదే ప్రజల హృదయాన్ని హత్తుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ తల్లి రోడ్డు పక్కన చంటి బిడ్డతో కూర్చుని ఉంది. ఆమె ఏం చేసిందో చూపించే వీడియో వైరల్‌ గా మారింది.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో @ChapraZila అనే వినియోగదారు ఖాతాతో షేర్‌ చేయబడింది. ఈ 15 సెకన్ల నిడివిగల వీడియోలో ఒక తల్లి తన ఒడిలో చంటిబిడ్డను ఎత్తుకుని రోడ్డు పక్కన కూర్చుని ఉంది..ఆమె చుట్టూ ఉన్న రోడ్డు రద్దీగా ఉంది. నిరంతరాయంగా వాహనాలు వస్తూ పోతూ ఉన్నాయి.. కానీ, ఇవేవీ పట్టించుకోని ఆ తల్లి.. తన బిడ్డను చూస్తూ మురిసిపోతుంది. తన చిన్నారిపై అపారమైన ప్రేమను కురిపించడం కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ తల్లి తన బిడ్డతో మాట్లాడుతుంది. మరుసటి క్షణం ఆమె తన చిన్నారిని ముద్దుపెట్టుకుంటుంది.. మళ్లీ మళ్లీ అలానే చేస్తుంది. వీడియో చూస్తుంటే ఆ చిన్నారి తన తల్లి చెప్పిన మాటలన్నీ అర్థం చేసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. అతను కూడా ఆమెకు సమాధానం చెప్పాలనుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

తల్లి, బిడ్డల హృదయాన్ని హత్తుకునే ఈ 15 సెకన్ల వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు చాలా ఇష్టపడుతున్నారు. చాలా మంది దీన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 50 వేల మందికి పైగా చూశారు. కొన్ని వేల మంది దీన్ని లైక్ చేసారు. వీడియోను షేర్ చేసిన వినియోగదారు వీడియోకు పేద తల్లి చేతిలో యువరాజు అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు..అమ్మ ప్రేమ దొరికిన వాడు ఎప్పటికీ పేదవాడు కాదు సార్..అని రాశారు. అదే సమయంలో మరొక వినియోగదారు ఏ తల్లి పేదది కాదు అని రాశారు. చాలా మంది వినియోగదారులు హార్ట్‌ ఎమోజీలతో వీడియోని షేర్ చేసారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!