Aata 2.o: మీరు మంచి డ్యాన్సరా? ఆట 2.0 ఆడిషన్స్ ఇప్పుడు మన హైదరాబాద్‌లో.. పూర్తి వివరాలివే
మీరు మంచి డ్యాన్సరా? మీకున్న ట్యాలెంట్ తో ప్రొఫెషనల్ గా డ్యాన్సర్ గా మారాలనుకుంటున్నారా? అయితే జీ తెలుగు మీకు అందిస్తోన్న సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆట 2.O పేరుతో ఇప్పుడు మన హైదరాబాద్ లో ఆన్ గ్రౌండ్ అలాగే డిజిటల్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు మీకోసం

తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన డ్యాన్స్ రియాలిటీ షో ‘ఆట’. ఈ కార్యక్రమంతో ఎందరో ప్రతిభావంతులైన డాన్సర్లను వెలుగులోకి తీసుకొచ్చింది జీ తెలుగు. ఇప్పుడు ఆట 2.0 అంటూ సరికొత్త సీజన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే జీ తెలుగులో ఘనంగా ప్రారంభంకానున్న ఈ డ్యాన్స్ రియాలిటీ షోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా ఆడిషన్స్ నిర్వహిస్తోంది. డ్యాన్స్ పై మక్కువ గల వారికి జీ తెలుగు అందిస్తున్న సువర్ణావకాశం. 18 నుంచి 60 సంవత్సరాల వయసు గల ఎవరైనా ఈ ఆడిషన్స్‌లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. డిసెంబర్ 21(ఆదివారం)న ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు హైదరాబాద్‌లోని శ్రీ సారథి స్టూడియోస్, అమీర్ పేట నందు జీ తెలుగు ఆధ్వర్యంలో ఆట 2.0 ఆడిషన్స్ జరగనున్నాయి. ఆన్ గ్రౌండ్ ఆడిషన్స్ లో పాల్గొనలేని వారు డిజిటల్ ఆడిషన్స్ లో హాజరుకావొచ్చు.
వాటాప్స్(WhatsApp )లో 70322 23913 అనే నెంబర్ కు ‘Hi’ అని మెసేజ్ చేయండి లేదా https://aata.zee5.com వెబ్ సైట్ లోనూ మీ డాన్స్ వీడియోను అప్లోడ్ చేసి ఆడిషన్స్ లో పాల్గొని మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం పొందవచ్చు. డాన్స్ అంటే ఇష్టపడేవారికి గొప్పఅవకాశం. అందులోనూ మన హైదరాబాద్ లో ఆడిషన్స్. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆడిషన్స్ లో పాల్గొనండి. జీ తెలుగు ఆట 2.0 టైటిల్ పోటీలో సత్తా చాటండి.
18 నుంచి 60 సంవత్సరాల వయసు గల ఎవరైనా అర్హులే..
Instagram-এ এই পোস্টটি দেখুন
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







