RRR Movie : ఆశలు రేకెత్తిస్తున్న టాక్.. దర్శక ధీరుడి ‘ఆర్ఆర్ఆర్‌‌‌’కు ‘ఆస్కారం’ ఉందా.?

బ్యాక్‌టుబ్యాక్ పన్నెండు సినిమాల్ని బ్లాక్‌బస్టర్లుగా మలిచి... ఇండియన్ బాక్సాఫీస్‌ లెక్కల్ని తిరగరాశాడన్న క్రెడిట్ దక్కింది జక్కన్నకు. రాజమౌళి సినిమా అనేది సెల్యులాయిడ్ సర్కిల్స్‌లో ఒక కేస్‌ స్టడీగా కూడా మారిపోయింది.

RRR Movie : ఆశలు రేకెత్తిస్తున్న టాక్.. దర్శక ధీరుడి 'ఆర్ఆర్ఆర్‌‌‌'కు 'ఆస్కారం' ఉందా.?
Rrr
Follow us

|

Updated on: Apr 05, 2022 | 10:12 AM

RRR Movie : బ్యాక్‌టుబ్యాక్ పన్నెండు సినిమాల్ని బ్లాక్‌బస్టర్లుగా మలిచి.. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కంటిన్యూ అవుతున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. జక్కన్న సినిమా అనేది సెల్యులాయిడ్ సర్కిల్స్‌లో ఒక కేస్‌ స్టడీగా కూడా మారిపోయింది. సినిమాల్లో జక్కన్న సినిమా వేరయా అనే ఒపీనియన్‌ కూడా మేకర్స్‌లో స్థిరపడిపోయింది. వాట్ నెక్ట్స్ ఫర్ రాజమౌళి అంటే.. ఇంకేంటి ఆస్కారేగా అంటోంది క్రిటిక్ ప్రపంచం. లోకల్ టు గ్లోబల్‌… ట్రిపులార్ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. బాహుబలి2 రికార్డుల్ని చేజ్‌ చేస్తూ దూసుకెళుతోంది జక్కన్న తాజా వండర్. సరిగ్గా ఇదే గ్యాప్‌లో ఆస్కార్ రేస్‌లో ఆర్ఆర్ఆర్ అనే సరికొత్త టాక్ మొదలైంది. ట్రిపులార్‌కి ఆస్కార్ రేంజ్ ఎందుకుండదు… ఎకాడమీ అవార్డుల్ని వేటాడే దమ్ము ఆర్ఆర్ఆర్ ఉంది.  టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ ఈ రకమైన టాపిక్ గట్టిగా నడుస్తోందిప్పుడు. మూడుగంటల పాటు ఆడియన్స్‌ని కట్టిపడేసి కనురెప్ప వాల్చనివ్వనంత రిచ్‌గా విజువల్ ఫీస్ట్‌నిచ్చారంటూ ట్రిపులార్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు సినీజనం. సినిమాటోగ్రఫీ నుంచి స్టంట్స్ అండ్ వీఎఫ్‌ఎక్స్ దాకా.. అన్ని సెక్టార్స్‌లోనూ డిస్టింక్షన్ మార్కులేయించుకుంది ఆర్ఆర్ఆర్ మూవీ. రామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా ఎన్టీయార్.. సెంట్ పర్సెంట్ పెర్ఫామెన్స్ నిచ్చారన్న కాంప్లిమెంట్స్ కూడా వున్నాయి. వీటిలో ఏదో ఒక కేటగిరీలో ఈసారి ఆస్కార్‌కి నామినేట్ అయ్యే ఆస్కారముంది.

ఇదే క్యాలెండర్‌ సెకండాఫ్‌లో రిలీజ్ కాబోయే బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్ మీద కూడా ఆస్కార్ హోప్స్ బలంగానే వున్నాయి. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి తీస్తున్న బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్‌ సూపర్‌హీరో ఫిలిమ్‌గాను, మైథలాజికల్ వండర్‌గానూ ప్రమోట్ అవుతోంది. మోషన్ పోస్టర్‌తోనే తన సినిమాలో వుండబోయే క్వాలిటీ ఏంటో చెప్పేశారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.  గత రెండేళ్లలో మన వైపు నుంచి సూర్య సినిమాలు ఆకాశం నీ హద్దురా, జైభీమ్‌ జస్ట్ కంటెంట్ అండ్ నేచురాలిటీ పరంగా ఆస్కార్‌ మీద ఆశలు రేకెత్తించాయి. ఈసారి మాత్రం ఫాంటసీ ఎలిమెంట్ పక్కాగా వర్కవుటౌతుందని, బ్రహ్మాస్త్ర ఫస్ట్‌ పార్ట్.. అండ్ ట్రిపులార్.. ఆస్కార్ తెచ్చిపెట్టే ఛాన్సుందని మనోళ్ల నమ్మకం. చూడాలి మరి ఏంజరుగుతుందో.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: చక్కనైన కళ్లు.. బూరెబుగ్గలు.. ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు యూత్ ఐకాన్..

Arabic Kuthu: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న ‘అరబిక్ కుతు’ సాంగ్ తెలుగు వెర్షన్.. ఇంతకీ మీరూ విన్నారా ?..

Sarkaru Vaari Paata: మహేష్ బాబు ఫ్యాన్స్‏కు మళ్లి నిరాశేనా !.. సర్కారు వారి పాట వాయిదా ?.. ఇప్పుడిదే హాట్ టాపిక్..

Latest Articles