AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: మరో అరుదైన రికార్డును అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌.. ఆ జాబితాలో వన్‌ అండ్‌ ఓన్లీ ఇండియన్‌ మూవీగా..

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోంది. మార్చి 25న గ్రాండ్‌గా రిలీజైన ఈ ఫిక్షనల్‌ థ్రిల్లర్‌ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

RRR Movie: మరో అరుదైన రికార్డును అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌.. ఆ జాబితాలో  వన్‌ అండ్‌ ఓన్లీ ఇండియన్‌ మూవీగా..
Basha Shek
|

Updated on: Apr 05, 2022 | 10:21 AM

Share

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోంది. మార్చి 25న గ్రాండ్‌గా రిలీజైన ఈ ఫిక్షనల్‌ థ్రిల్లర్‌ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan), యంగ్ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్ (JR.NTR)ల అభినయాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. అందుకే సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్నా కలెక్షన్లలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లు చేసిందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఇక ప్రముఖ ఆన్‌లైన్‌ టికెట్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌ మై షో రేటింగ్‌లోనూ టాప్‌ పొజిషన్లో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌ తాజాగా మరో రికార్డు సృష్టించింది. అదేంటంటే.. ప్రముఖ మూవీ డేటా బేస్‌ సంస్థ IMDBలో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాలో టాప్ 5 లో నిలిచిన ఏకైక ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది.

ఈ జాబితాలో కోడా చిత్రం మొదటి స్థానంలో ఉంది. ఇటీవలే ఈ సినిమాకు అస్కార్‌ పంట పండింది. రెండో స్థానంలో డెత్‌ ఆన్‌ ది నైల్‌, మూడో స్థానంలో మార్బియస్‌, నాలుగో స్థానంలో బ్యాట్‌మెన్‌ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ హాలీవుడ్‌ సినిమాల కంటే ఐదో స్థానంలో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకే ఎక్కువ రేటింగ్‌ రావడం విశేషం. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ల అభినయం, రాజమౌళి టేకింగ్‌ ఈ సినిమాను హాలీవుడ్ సినిమాల సరసన నిలబెట్టాయని చెప్పచ్చు. ఇక కీరవాణి అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ సీత పాత్రలో సందడి చేయగా, ఓలీవియా మోరీస్‌ మరో హీరోయిన్‌గా నటించింది. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియాశరణ్‌, సముద్రఖని అతిథి పాత్రల్లో మెప్పించారు.

Also Read:Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే రోగ నిరోధక శక్తి తగ్గినట్లే, ఇలా చేయండి..

Bikshamaiah Goud: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే.. కాషాశం కండువా కప్పి ఆహ్వానించారు తరుణ్‌చుగ్

Viral Video: చిరుతకు చుక్కలు చూపించిన అడవి పంది.. ప్రాణ భయంతో చిరుత పరుగో పరుగు..!

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్