- Telugu News Photo Gallery Cinema photos Rashmika mandanna birthday special National Crush rashmika success journey
Rashmika Mandanna: కన్నడ ఇండస్ట్రీ టు నేషనల్ క్రష్.. బర్త్‌డే గర్ల్ రష్మిక సక్సెస్ జర్నీపై ఓ లుక్కేయండి..
Rashmika Mandanna: అందానికి, నటనకు మారుపేరు నటి రష్మిక మందన. అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఈ బ్యూటీ పుట్టిన రోజు నేడు ఈ సందర్భంగా ఈ అమ్మడి సినీ కెరీర్‌పై ఓ లుక్కేయండి..
Updated on: Apr 05, 2022 | 11:04 AM

కన్నడలో వచ్చిన 'కిరిక్ పార్టీ' సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార రష్మిక మందన. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ తర్వాత 'ఛలో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో తన నటన, అందంతో తెలుగు కుర్రకారు మదులను దోచేసింది.

అనంతరం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'గీత గోవిందం' సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఇండస్ట్రీ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ఈ సక్సెస్‌తో రష్మికకు ఆఫర్లు వెల్లువెత్తాయి.

సరిలేరు నీకెవ్వరు, భీష్మా, డియాడ్ కామ్రేడ్ వంటి చిత్రాలతో టాలీవుడ్ బిజీ హీరోయిన్ల జాబితాలో ఒకరిగా చోటు సంపాదించుకుంది. దీంతో టాలీవుడ్‌లో ఈ అమ్మడి పేరు మారుమోగింది. ఈ సమయంలోనే బాలీవుడ్ ఆఫర్లు కూడా దక్కాయి. దీంతో రష్మిక నేషనల్ క్రష్‌గా మారింది.

ఇక అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప' సినిమాలో నటించిన రష్మిక యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకుంది. ఈ సినిమాలో డీగ్లామర్‌పాత్రలో నటించి మొప్పించిందీ బ్యూటీ. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లో మిషన్ మజ్నూ, గుడ్ బై వంటి బాలీవుడ్ చిత్రాలతో పాటు, పుష్ప సీక్వెల్‌లో నటిస్తోంది.

ఈ అమ్మడి ట్యాలెంట్‌కు ఎన్నో అవార్డులు దక్కాయి. కిరిక్ పార్టీ సినిమాకు గాను సైమా బెస్ట్ డెబ్యూట్ నటిగా అవార్డు అందుకుంది. గీత గోవిందం సినిమాకుగాను జీ సినిమా అవార్డ్స్ ఫేవరేట్ నటిగా, ఫిలిమ్ ఫేర్ సౌత్ అవార్డును అందుకుంది. డీయర్ కామ్రేడ్ చిత్రానికి గాను ఉత్తమ నటి (క్రిటిక్స్)గా సైమా అవార్డు దక్కించుకుంది.

కన్నడ ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టి, నేడు జాతీయ సినిమా స్థాయికి ఎదిగిన అందాల తార రష్మిక పుట్టిన రోజు (ఏప్రిల్ 4) సందర్భంగా ఈ బ్యూటీకి మనం కూడా విషెస్ చెప్పేద్దామా.!




