- Telugu News Photo Gallery Rashmika Mandanna Luxurious Things owened by national crush Rashmika Mandanna
Rashmika Mandanna: 26 ఏళ్లకే కోట్ల విలువచేసే ఇల్లు, ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం గడుపుతోన్న క్రేజీ హీరోయిన్!
ఎక్స్‌ప్రెషన్ క్వీన్‌గా పేరుగాంచిన రష్మిక మందన ముద్దుగుమ్మ అనతికాలంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. నేడు ఆమె పుట్టినరోజు సందరర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..
Updated on: Apr 05, 2022 | 12:43 PM

ఛలో, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేకె నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి దక్షిణాది చిత్రాలతో ఓ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక చాలా తక్కువ టైంలో స్టార్‌డమ్ సొంతం చేసుకుంది.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే వారిలో నటి రష్మిక ఒకరు. రష్మికకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. రూ. 50 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్-సితోపాటు, ఆడి క్యూ3, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా కూడా ఆమె కలెక్షన్లలో ఉన్నాయి.

రష్మికకు బెంగళూరులో రూ.8 కోట్ల విలువైన లగ్జరీ హౌస్ ఉంది. వృత్తి రిత్యా ముంబై, హైదరాబాద్‌లకు ప్రయాణం చేయవల్సి రావడంతో ముంబైలో కూడా ఓ ఇల్లు కొనేసింది.

లక్షల విలువచేసే లగ్జరీ బ్యాగ్స్, ట్రెండీ ఫుట్‌వేర్ కూడా ఆమె కలెక్షన్లలో ఉన్నాయి. ఇక రష్మిక స్టైలిష్ లుక్స్ గురించి సోషల్ మీడియాలో ఏకంగా చర్చాగోష్టి నడుస్తోంది.

కేవలం 26 ఏళ్ల వయసుకే చిత్ర పరిశ్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
