Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే రోగ నిరోధక శక్తి తగ్గినట్లే, ఇలా చేయండి..

Health: అందరూ అనారోగ్యం బారిన పడతారు. కానీ కొందరు మాత్రం అనారోగ్యం బారిన పడినా యాక్టివ్‌గా ఉంటారు. జ్వరంలాంటివి వచ్చినా రెండు రోజుల్లో కోలుకుంటారు. మరికొందరు అయితే...

Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే రోగ నిరోధక శక్తి తగ్గినట్లే, ఇలా చేయండి..
Health
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 05, 2022 | 10:15 AM

Health: అందరూ అనారోగ్యం బారిన పడతారు. కానీ కొందరు మాత్రం అనారోగ్యం బారిన పడినా యాక్టివ్‌గా ఉంటారు. జ్వరంలాంటివి వచ్చినా రెండు రోజుల్లో కోలుకుంటారు. మరికొందరు అయితే చిన్న జలుబు వచ్చినా రోజులు తరబడి అనారోగ్యంతోనే ఉంటారు. దీనంతటికీ మనలోని రోగనిరోధక శక్తే కారణం. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి వ్యాధి త్వరగా నయం కాదు, అదే నిరోధక శక్తి ఎక్కువ ఉన్న వారు త్వరగా కోలుకుంటారు.

అనారోగ్యం బారిన పడిన తర్వాత మందులు వాడేకంటే ముందే రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. అయితే మనలో రోగ నిరోధక శక్తి తగ్గిందని చెప్పడానికి ముందు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటి ఆధారంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిందన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఆ లక్షణాలు ఏంటంటే..

* వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వారికి పొట్ట సంబంధిత సమస్య వేధిస్తుంది. నిత్యం కడుపులో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. దీనికి కారణం 70 శాతం రోగనిరోధక శక్తి జీర్ణకోశంలోనే పనిచేయడమే.

* రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారు నీరసంగా ఉంటారు. వీరిలో చిన్న పనులకే నీరసం ఆవహిస్తుంది. శరీరం శక్తి హీనంగా, చికాకుగా ఉంటుంది.

* చిన్న చిన్న పనులకే ఒత్తిడిగా అనిపిస్తే మీలో రోగనిరోధక శక్తి తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. ఒత్తిడి కారణంగా మానసిక సమస్యలే కాకుండా శరీరంపై కూడా దుష్ప్రభావం పడుతుంది.

* కొందరికి తరచూ జలుబు చేస్తుంది. ఎన్ని రకాల మందులు వాడినా జలుబు మాత్రం ఆగదు. ఇలాంటి లక్షణం కనిపిస్తే రోగనిరోధక శక్తి తగ్గిందని గుర్తించాలి.

* రోగ నిరోధశక్తి తక్కువ ఉన్న వారికి ఏదో ఒక ఇన్ఫెక్షన్‌ సోకుతుంది. చెవి ఇన్ఫెక్షన్‌, నిమోనియా వంటి సమస్యలతో బాధపడుతుంటారు.

రోగ నిరోధక శక్తి పెరగాలంటే..

రోగ నిరోధక శక్తి పెరగాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ, పప్పులు, క్యారెట్, బీట్ రూట్, అల్లం, వెల్లుల్లి, గుడ్లు, పాలు, నట్స్, పాలకూరపుదీనా, చికెన్, చేపలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. కేవలం తీసుకునే ఆహారం విషయంలోనే కాకుండా జీవనశైలి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. సరిపడ నిద్య, యోగా, మెడిటేషన్‌ వంటివి చేస్తుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Also Read: IPL 2022: ఐపీఎల్‌ డబ్బులతో మా అమ్మకు ఆ బహుమతి ఇవ్వాలనుకుంటున్నా.. పంజాబ్‌ కింగ్స్ బౌలర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Dance Video: ఇట్లుండాల.. డాన్స్‌ అంటే.. పరేషాన్‌ అవుతున్న నెటిజనం..!

Owaisi on Navratri: దక్షిణ ఢిల్లీలో నేటి నుండి మాంసం దుకాణాలు బంద్.. ఘాటుగా స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ