AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఐపీఎల్‌ డబ్బులతో మా అమ్మకు ఆ బహుమతి ఇవ్వాలనుకుంటున్నా.. పంజాబ్‌ కింగ్స్ బౌలర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Vaibhav Arora: క్రికెట్‌లో క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా పేరున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ఎంతోమంది క్రికెటర్ల జీవితాలను మార్చుతోంది. అనామకులుగా పేరున్న వారిని తమ ప్రతిభతో ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు ఒక వేదికలా నిలుస్తోంది.

IPL 2022: ఐపీఎల్‌ డబ్బులతో మా అమ్మకు ఆ బహుమతి ఇవ్వాలనుకుంటున్నా.. పంజాబ్‌ కింగ్స్ బౌలర్‌  ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Vaibhav Arora
Basha Shek
|

Updated on: Apr 05, 2022 | 9:27 AM

Share

Vaibhav Arora: క్రికెట్‌లో క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా పేరున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ఎంతోమంది క్రికెటర్ల జీవితాలను మార్చుతోంది. అనామకులుగా పేరున్న వారిని తమ ప్రతిభతో ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు ఒక వేదికలా నిలుస్తోంది. ఈ సీజన్‌లో కూడా చాలామంది యువ ఆటగాళ్లు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. కాగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పటిష్ఠమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ ఏకంగా 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు పంజాబ్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు పంజాబ్‌ బౌలర్‌ వైభవ్‌ అరోరా (Vaibhav Arora). ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అరోరా.. 21 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మొదట రాబిన్‌ ఊతప్పను బోల్తా కొట్టించిన ఈ యంగ్ బౌలర్‌.. ఆ తర్వాత మొయిన్‌ అలీని క్లీన్‌ బౌల్డ్‌ చేసి చెన్నైను కష్టాల్లోకి నెట్టాడు.

నాన్నకు ఆర్థికంగా..

కాగా ఈ మ్యాచ్‌లో కీలక బౌలర్‌ సందీప్‌శర్మను పక్కనపెట్టి మరీ వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు పంజాబ్‌ కెప్టెన్‌ మయాంక్‌. ఈక్రమంలో కెప్టెన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు అరోరా. కాగా ఈ లీగ్‌ ప్రారంభానికి ముందు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు ఈ యంగ్ బౌలర్‌. ఐపీఎల్‌ డబ్బులతో తన తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలుస్తానన్నాడు. ‘ మా నాన్న మా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఆయనకు వయసు కూడా సహకరిచండంలేదు. పనిచేయద్దని చెబుతున్నా ఆయన నా మాట వినడం లేదు. అందుకే ఐపీఎల్‌ నుంచి వచ్చే డబ్బుతో అమ్మానాన్నలకు నా వంతు సహాయపడాలనుకుంటున్నాను. మా అమ్మకు మంచి ఇల్లు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే నాన్నకు ఆర్థికంగా సహాయపడాలనుకుంటున్నాను’ అని ఆరోరా తెలిపాడు. కాగా హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన వైభవ్‌ను ఐపీఎల్‌- 2021 సీజన్‌లో కోల్‌కతా తీసుకుంది. అయితే ఒక్కమ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలంలో అతడిని పంజాబ్‌ కింగ్స్‌ రూ. 2కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఫ్రాంఛైజీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసే పనిలో ఉన్నాడు వైభవ్‌.

Also Read: RR vs RCB Playing XI IPL 2022: రాజస్థాన్‌ దూకుడుకి బెంగళూరు అడ్డుకట్ట వేసేనా? రెండు జట్ల ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే..

మద్యం సేవించిన తర్వాత ఆకలి ఎందుకు వేస్తుంది ?

T-Congress Leaders: హస్తినకు చేరిన టీ కాంగ్రెస్‌ నేతల పంచాయతీ.. కాసేపట్లో రాహుల్ గాంధీతో భేటీ