AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs RCB, IPL 2022: బెంగళూరుకు చుక్కలు చూపించేందుకు సిద్ధమైన స్పిన్‌ ద్వయం.. హార్డ్‌ హిట్టర్ల భరతం పట్టేలా ప్రణాళికలు..

RR vs RCB: ఒకరు క్యారమ్ బాల్స్‌తో కట్టడి చేస్తారు.. మరొకరు ఫ్లైట్‌ డెలివరీలతో బ్యాటర్ల పని పడతారు. మరి అలాంటిది ఆ ఇద్దరూ ఒకే జట్టులో ఉంటే ప్రత్యర్థి జట్లకు చుక్కలు కనిపించాల్సిందే.

RR vs RCB, IPL 2022: బెంగళూరుకు చుక్కలు చూపించేందుకు సిద్ధమైన స్పిన్‌ ద్వయం.. హార్డ్‌ హిట్టర్ల భరతం పట్టేలా ప్రణాళికలు..
Rr Vs Rcb
Basha Shek
|

Updated on: Apr 05, 2022 | 11:00 AM

Share

RR vs RCB: ఒకరు క్యారమ్ బాల్స్‌తో కట్టడి చేస్తారు.. మరొకరు ఫ్లైట్‌ డెలివరీలతో బ్యాటర్ల పని పడతారు. మరి అలాంటిది ఆ ఇద్దరూ ఒకే జట్టులో ఉంటే ప్రత్యర్థి జట్లకు చుక్కలు కనిపించాల్సిందే. వారే రాజస్థాన్‌ రాయల్స్ (RR) స్పిన్‌ ద్వయం రవిచంద్రన్‌ అశ్విన్‌, యుజువేంద్ర చాహల్‌. గత సీజన్లలో వేర్వేరు జట్ల తరఫున ఆడిన ఈ స్పిన్‌ మాంత్రికులు ఇప్పుడే ఒకే జెర్సీ ధరించి మైదానంలోకి దిగుతున్నారు. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సమష్ఠిగా ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పట్టారు. జట్టును విజయతీరాలకు చేర్చారు. నేడు జరిగే మూడో మ్యాచ్‌ (RR vs RCB) లో పటిష్ఠమైన బెంగళూరు బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

చెరో ఎండ్‌  నుంచి ..

IPL 2022లో, అశ్విన్, చాహల్ నంబర్‌ వన్‌ స్పిన్‌ జోడీగా పేరుతెచ్చుకుంటోంది. గత సీజన్లలో వేర్వేరు జట్లకు ఈ ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసి తమ బౌలింగ్‌ సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చుకుంది రాజస్థాన్‌. అందుకు తగ్గట్టే బంతితో అమోఘంగా రాణిస్తోంది ఈ స్పిన్‌ జోడి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన రాజస్థాన్‌ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉందంటే ఈ ఇద్దరు బౌలర్ల ప్రతిభ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో అశ్విన్‌, చాహల్‌లు ఎంతో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో 4 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు చాహల్‌. అయితే వికెట్లు తీయకున్నా మరో ఎండ్‌ నుంచి అశ్విన్‌ సన్‌రైజర్స్‌ బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యాడు. అతను 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ముంబై ఇండియన్స్‌తో జరిగిన తర్వాతి మ్యాచ్‌లోనూ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది శామ్సన్‌ సేన. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 170 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లోనూ అశ్విన్, చాహల్‌ ఇద్దరూ కలిసి 8 ఓవర్లలో 56 పరుగులిచ్చి 3 వికెట్లు నేలకూల్చారు. కాగా రాజస్థాన్‌ నేడు (ఏప్రిల్ 4న) ఆర్సబీతో తలపడుతోంది. ఆ జట్టులో డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లీ, దినేశ్‌ కార్తిక్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, డేవిడ్‌ విల్లీ, రూథర్‌ఫోర్డ్‌ లాంటి హార్డ్‌ హిట్టర్లు ఉన్నారు. మరి ఈ మ్యాచ్‌లో అశ్విన్‌-చాహల్‌ల జోడీ ఏ మేర సత్తా చాటనుందో చూడాలి.

Also Read: ESIC Recruitment 2022: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌లో స్పెషలిస్టు గ్రేడ్‌ – 2 ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు..

Kashmir Files: కాశ్మీర్ లోయలో మళ్ళీ పేట్రేగిపోతున్న ఉగ్రవాదులు.. పండిట్‌పై కాల్పులు

RRR Movie : ఆశలు రేకెత్తిస్తున్న టాక్.. దర్శక ధీరుడి ‘ఆర్ఆర్ఆర్‌‌‌’కు ‘ఆస్కారం’ ఉందా.?