- Telugu News Photo Gallery Cricket photos Ipl 2022 RCB former Skipper virat kohli needs 1 more four to become the first batsman to have 550 fours and 200 sixes in ipl
IPL 2022: ఐపీఎల్ చరిత్రలో తొలి బ్యాట్స్‌మెన్‌గా మారనున్న విరాట్ కోహ్లీ.. స్పెషల్ రికార్డుకు ఒక అడుగు దూరంలో..
విరాట్ కోహ్లి మైదానంలోకి దిగిన వెంటనే ప్రత్యేక రికార్డులు నెలకొల్పనున్నాడు. దీంతో చరిత్రలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు.
Updated on: Apr 05, 2022 | 2:13 PM

విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగిన వెంటనే స్పెషల్ రికార్డులు నెలకొల్పనున్నాడు. IPL 2022లో కేవలం ఒక ఫోర్ దూరంలో నిలిచాడు. ఒక్క ఫోర్ కొడితే, ఈ లీగ్ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన బ్యాట్స్‌మెన్‌గా చేస్తుంది. ఇంతకు ముందు ఏ బ్యాట్స్‌మెన్ చేయని విధంగా, ఆ రికార్డు విరాట్ కోహ్లి పేరిట తొలిసారిగా చేరనుంది.

ఒక్క బౌండరీ కొట్టిన వెంటనే విరాట్ ఐపీఎల్‌లో 550 ఫోర్లు పూర్తి చేస్తాడు. దీంతో లీగ్‌లో 550 ఫోర్లతో 200 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కనున్నాడు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు సాధించిన రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉంది. ధావన్ ఇప్పటివరకు 664 ఫోర్లు సాధించాడు. అదే సమయంలో, విరాట్ రెండవ స్థానంలో ఉండగా, డేవిడ్ వార్నర్ 526 ఫోర్లతో మూడవ స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యధికంగా 355 సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. కాగా, విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 212 సిక్సర్లతో ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు.




