- Telugu News Photo Gallery Cricket photos IPL 2022: These 4 young players Flop show in ipl 2022 Tournament; Shahrukh Khan, Ruturaj Gaikwad, Avesh Khan and Venkatesh Iyer
IPL 2022: గత సీజన్‌లో హీరోలు.. ప్రస్తుతం జీరోలు.. ఫ్లాప్‌షోతో ఆకట్టుకోని ఆ ప్లేయర్స్ ఎవరంటే?
ఐపీఎల్ 15వ సీజన్ మొదలైంది. ఇప్పటి వరకు అన్ని జట్లు మొదటి 3 మ్యాచ్‌లు ఆడాయి. కానీ, ఈ 3 మ్యాచ్‌ల్లో చాలా మంది ప్లేయర్లు సత్తా చాటలేక ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో నలుగురు ఐపీఎల్ 2021లో మెరిసిన తారలున్నారు.
Updated on: Apr 04, 2022 | 3:36 PM

ఐపీఎల్ అంటేనే యువ ఆటగాళ్లకు ఎంతో ఉత్సాహం. తమ ప్రతిభను చాటుకోవడానికి ఇదో చక్కని వేదికలా మారింది. ఇక్కడ ఎవరైనా హీరో అవ్వొచ్చు. ఎవరైనా జీరో కావొచ్చు. ఇక్కడ కొందరు స్టార్‌లుగా మారితే, కొందరు చెత్త ప్రదర్శనతో నిరాశపరుస్తున్నారు. ఐపీఎల్ 15వ సీజన్ మొదలైంది. ఇప్పటి వరకు అన్ని జట్లు మొదటి 3 మ్యాచ్‌లు ఆడాయి. కానీ, ఈ 3 మ్యాచ్‌ల్లో చాలా మంది ప్లేయర్లు సత్తా చాటలేక ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో నలుగురు ఐపీఎల్ 2021లో మెరిసిన తారలు. గత సీజన్‌లో స్టార్స్‌గా మారారు. కానీ 15వ సీజన్‌లో తొలి 3 మ్యాచ్‌ల్లో ప్రదర్శన విషయంలో మాత్రం విఫలమయ్యారు.

షారుక్ ఖాన్: 2021లో IPL మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్ తరపున షారుక్ ఖాన్ ఒకదాని తర్వాత మరొకటి హిట్ ఇన్నింగ్స్ ఆడుతూ కనిపించాడు. IPL 2021లో, అతను 11 మ్యాచ్‌లలో 10 ఇన్నింగ్స్‌లలో 134.21 స్ట్రైక్ రేట్‌తో 153 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 9 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. విశేషమేమిటంటే.. షారుక్ ఖాన్ గత సీజన్‌లో పెద్ద ఇన్నింగ్స్‌లేవీ ఆడలేదు. కానీ, విలువైన ఇన్నింగ్స్‌లు ఆడి, జట్టు విజయానికి తోడయ్యాడు. ఐపీఎల్ 2022లో అతని జట్టు గెలుస్తోంది. కానీ అతని ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అతని బ్యాటింగ్‌లో గత సీజన్ టచ్ లేదు. తొలి 3 మ్యాచ్‌ల్లో షారుక్ ఖాన్ 83.33 స్ట్రైక్ రేట్‌తో కేవలం 30 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

వెంకటేష్ అయ్యర్: అతను IPL 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన 10 మ్యాచ్‌లలో 41.11 సగటు, 128.47 స్ట్రైక్ రేట్‌తో 370 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 4 అర్ధ సెంచరీలు సాధించాడు. కానీ, IPL 2022లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 78.97 స్ట్రైక్ రేట్‌తో 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

రితురాజ్ గైక్వాడ్: పరుగుల పరంగా IPL 2021 సూపర్ స్టార్‌గా నిలిచాడు. అతను CSK తరపున 16 మ్యాచ్‌ల్లో 635 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. ఆరెంజ్ క్యాప్‌ని అందుకున్నాడు. కానీ, ఐపీఎల్ 2022లో కథ వేరేలా ఉంది. 3 మ్యాచ్‌ల్లో 3 పరుగులు కూడా చేయలేదు. IPL 2022లో CSK ప్రదర్శన చెత్తగా ఉంటే, రితురాజ్ బ్యాట్ వైఫల్యం కూడా అందుకు పెద్ద కారణంగా తయారైంది.

అవేశ్ ఖాన్: ఐపీఎల్ 2022లో జట్టు మారిన వెంటనే అవేశ్ ఖాన్ ఆట కూడా మారిపోయింది. గత సీజన్‌లో లాగా వికెట్లు తీయడం లేదు. IPL 2021లో, అతను ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్నప్పుడు 16 మ్యాచ్‌లలో 24 వికెట్లు తీసుకున్నాడు. ఈ సీజన్‌లో అంటే IPL 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడుతూ, ఇప్పటివరకు 2 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు మాత్రమే తీశాడు.




