RR vs RCB Playing XI IPL 2022: రాజస్థాన్ దూకుడుకి బెంగళూరు అడ్డుకట్ట వేసేనా? రెండు జట్ల ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే..
RR vs RCB: రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సమయంలో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
ఐపీఎల్ 2022 (IPL 2022) లో ఈ సీజన్‌లో చాలా బలంగా పరిగణించిన రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతంది. అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)తో తలపడనుంది. రాజస్థాన్ జట్టు రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో నంబర్‌వన్‌లో ఉండగా, బెంగళూరు రెండు మ్యాచ్‌లలో ఒక విజయం, ఒక ఓటమితో ఏడో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ తన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి బెంగళూరు జట్టు బరిలోకి దిగుతోంది. ముంబైపై ప్రదర్శన చేసిన తీరు రాజస్థాన్ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది.
మరోవైపు బెంగళూరు గురించి చెప్పాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఈ జట్టు బాగానే ఆడింది. ఈ జట్టు మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై బలమైన స్కోరు సాధించిన తర్వాత కూడా ఓడిపోయింది. అయితే తన రెండవ మ్యాచ్‌లో కోల్‌కతాను ఓడించింది. ఈ మ్యాచ్ తక్కువ స్కోరింగ్ అయినప్పటికీ చాలా ఆసక్తికరంగా మారింది.
రాజస్థాన్ ప్లేయింగ్ XIలో మార్పులు..
రాజస్థాన్ గురించి మాట్లాడితే, దాని బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తుంది. ముంబైపై జోస్ బట్లర్ అద్భుత సెంచరీ చేశాడు. దేవదత్ పడిక్కల్, కెప్టెన్ సంజూ శాంసన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. అదే సమయంలో, షిమ్రాన్ హెట్మెయర్ గత రెండు మ్యాచ్‌లలో లోయర్ ఆర్డర్‌లో తుఫాను ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌లో మార్పు రావచ్చు. ఇప్పటి వరకు ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో, రియాన్ పరాగ్‌ని పక్కనపెట్టి, రాసి వాన్ డెర్ దుస్సేన్‌కు ఆవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.
బెంగళూరు జట్టులో మార్పులు లేకపోవచ్చు..
గ్లెన్ మాక్స్‌వెల్ బెంగుళూరు జట్టులో చేరాడు. కానీ, అతను అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఇంకా స్పష్టంగా లేదు. ఒకవేళ మ్యాక్స్‌వెల్ ఆడితే, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ తప్పుకోవాల్సి రావచ్చు. ఈ టీమ్‌లోని మిగతా వారిలో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదు.
రెండు జట్లలో ప్లేయింగ్-11 ఇలా ఉండొచ్చు..
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ (కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రాసి వాన్ డెర్ డస్సెన్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ (కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్/గ్లెన్ మాక్స్‌వెల్, డేవిడ్ మిల్లీ, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
Also Read: SRH vs LSG Live Score, IPL 2022: టాస్ గెలిచిన కేన్ మామ.. ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?
SRH vs LSG: స్టోయినిస్ నుంచి ఫిలిప్స్ వరకు.. నేటి మ్యాచ్‌లో కనిపించని దిగ్గజ ఆటగాళ్ళు వీరే..