AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs LSG Highlights, IPL 2022: చెలరేగిన అవేశ్ ఖాన్.. సన్ రైజర్స్ కు రెండో ఓటమి..

SRH vs LSG Highlights in Telugu: సన్‌రైజర్స్ హైద్రాబాద్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

SRH vs LSG Highlights, IPL 2022: చెలరేగిన అవేశ్ ఖాన్.. సన్ రైజర్స్ కు రెండో ఓటమి..
Ipl 2022 Srh Vs Lsg
Venkata Chari
| Edited By: Anil kumar poka|

Updated on: Apr 16, 2022 | 7:36 PM

Share

సన్‌రైజర్స్ హైద్రాబాద్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 157/9 పరుగులు మాత్రమే చేసింది. రాహుల్‌ త్రిపాఠి (44), నికోలస్‌ పూరన్‌ (34) ధాటిగా ఆడిన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. లక్నో బౌలర్లు చివర్లో విజృంభించడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి టోర్నీలో రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్నో బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ (24/4), హోల్డర్‌ (34/3) రాణించారు.

రెండు జట్లు..

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ (కీపర్), ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

Key Events

గత మ్యాచ్‌ల్లో ఇరు జట్ల పరిస్థితి?

హైదరాబాద్ ఇప్పటి వరకు ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓటమి పాలైంది. లక్నో రెండు మ్యాచ్‌లు ఆడి, ఒకటి గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడిపోయింది.

హైదరాబాద్ టీంకు గెలుపు కీలకం

సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈ రోజు గెలిచి, ఐపీఎల్ 2022లో విజయాల ఖాతాను తెరవాలని కోరుకుంటోంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 12 Apr 2022 11:25 PM (IST)

    చెన్నై విజయం

    ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్‌ స్పోర్ట్స్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్(CSK) మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. శివం దూబే(Shivam Dube) మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. దూబే 46 బంతుల్లో 88(5 ఫోర్లు, 8 సిక్స్‌లు)పరుగులు చేశాడు. రాబిన్‌ ఉతప్పు కూడా చాలా రోజుల తర్వాత క్లాసిక్‌ ఇన్సింగ్స్ ఆడాడు. అతను 50 బంతుల్లో 88(4 ఫోర్లు, 9 సిక్స్‌లు) పరుగులు చేశాడు. రుతురాజ్‌ గైక్వాడ్ 17, మొయిన్ అలీ 3 పరుగులు చేసి రనౌట్ కాగా రవీంద్ర జడేజా డకౌట్‌ అయ్యాడు. ధోనీ బ్యాటింగ్‌కు దిగిన స్ట్రైక్‌ రాలేదు. హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా, హాజెల్‌వుడ్‌ ఒక వికెట్ తీశాడు.

  • 07 Apr 2022 11:33 PM (IST)

    డికాక్ సూపర్ ఇన్నింగ్స్.. ఢిల్లీపై లక్నో ఘన విజయం..

    కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG) ఐపీఎల్‌ టోర్నీలో మూడో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 150 పరుగుల టార్గెట్‌ను ఆ జట్టు 2 బంతులు ఉండాగానే అందుకుంది. క్వింటన్‌ డికాక్‌(80) రన్స్‌ తో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు.

  • 04 Apr 2022 11:14 PM (IST)

    12 పరుగుల తేడాతో సన్ రైజర్స్ పరాజయం..

    సన్‌రైజర్స్ హైద్రాబాద్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 157/9 పరుగులు మాత్రమే చేసింది. రాహుల్‌ త్రిపాఠి (44), నికోలస్‌ పూరన్‌ (34) ధాటిగా ఆడిన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. లక్నో బౌలర్లు చివర్లో విజృంభించడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి టోర్నీలో రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్నో బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ (24/4), హోల్డర్‌ (34/3) రాణించారు.

  • 04 Apr 2022 11:06 PM (IST)

    ఆరో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌..

    అవేశ్‌ ఖాన్‌ హైద్రాబాద్‌ను మళ్లీ దెబ్బకొట్టాడు. అతని బౌలింగ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు అబ్దుల్‌ సమద్‌ (0). దీంతో ఆ జట్టు ఆరోవికెట్‌ కోల్పోయింది. విజయానికి ఇంకా 12 బంతుల్లో 26 పరుగులు అవసరం.

  • 04 Apr 2022 11:03 PM (IST)

    పూరన్‌ ఔట్‌..

    అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌ లో భారీ షాట్‌ ఆడే యత్నంలో నికోలస్‌ పూరన్‌ (34) ఔటయ్యాడు. దీంతో సన్‌రైజర్స్‌ 5 వికెట్‌ కోల్పోయింది. ఆ జట్టు విజయానికి ఇంకా 15 బంతుల్లో 27 పరుగులు అవసరం.

  • 04 Apr 2022 10:59 PM (IST)

    ధాటిగా ఆడుతోన్న పూరన్‌..

    నికోలస్‌ పూరన్‌ (20 బంతుల్లో 27) ధాటిగా ఆడుతున్నాడు. జట్టును విజయతీరాలవైపు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాడు. అతనికి తోడుగా సుందర్‌ (12) క్రీజులో ఉన్నాడు. 17 ఓవర్లు ముగిసే సరికి హైద్రాబాద్ స్కోరు 137/4. విజయానికి ఇంకా 18 బంతుల్లో 33 పరుగులు అవసరం.

  • 04 Apr 2022 10:52 PM (IST)

    ఉత్కంఠగా జరుగుతోన్న మ్యాచ్‌.. రాహుల్‌ త్రిపాఠి ఔట్‌..

    విజయం కోసం లక్నో, హైదరాబాద్‌ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ధాటిగా ఆడుతోన్న రాహుల్‌ త్రిపాఠి (44)ని కృనాల్‌ పాండ్యా ఔట్‌ చేయడంత సన్‌ రైజర్స్‌ 4 వికెట్‌ కోల్పోయింది. ఆ జట్టు విజయానికి 24 బంతుల్లో 41 పరుగులు అవసరం. వాషింగ్టన్‌ సుందర్ (10), నికోలస్‌ పూరన్‌ (26) క్రీజులో ఉన్నారు.

  • 04 Apr 2022 10:21 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన సన్‌ రైజర్స్‌.. మర్కరమ్ ఔట్‌..

    హైద్రాబాద్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న మర్కరమ్‌ (12) కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో నికోలస్‌ పూరన్‌ బరిలోకి దిగాడు.

  • 04 Apr 2022 10:19 PM (IST)

    ధాటిగా బ్యాటింగ్‌ చేస్తోన్న రాహుల్ త్రిపాఠి..

    రాహుల్‌ త్రిపాఠి (21 బంతుల్లో 35) ధాటిగా ఆడుతున్నాడు. అతనికి తోడుగా మర్కరమ్‌ (12) క్రీజులో ఉన్నాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్‌ స్కోరు 82/2.

  • 04 Apr 2022 10:08 PM (IST)

    50 పరుగులు దాటిన సన్‌ రైజర్స్‌ స్కోరు..

    సన్‌ రైజర్స్‌ హైద్రాబాద్‌ స్కోరు 50 పరుగులు దాటింది. రాహుల్‌ త్రిపాఠి (19), మక్రమ్‌ (6) నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. సన్‌రైజర్స్‌ విజయానికి ఇంకా 74 బంతుల్లో 109 పరుగులు అవసరం.

  • 04 Apr 2022 09:58 PM (IST)

    అవేశ్‌ ఖాన్‌ మరో వికెట్‌..

    లక్నో బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ ఫైర్‌ మీద ఉన్నాడు. హైద్రాబాద ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్‌కు పంపించాడు. మొదట విలియమ్సన్‌ను ఔట్‌ చేసిన అతడు 6 ఓవర్‌ మొదటి బంతికే అభిషేక్‌ శర్మను పెవిలియన్‌కు పంపించాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 5.4 ఓవర్లు ముగిసే సరికి 39/2

  • 04 Apr 2022 09:51 PM (IST)

    మొదటి వికెట్‌ కోల్పోయిన హైద్రాబాద్‌.. విలియమ్సన్‌ ఔట్‌..

    లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. ఆజట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్స్‌ (16) అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌ లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 4 ఓవర్లకు 28/1. క్రీజులో అభిషేక్‌ శర్మ (8), రాహుల్‌ త్రిపాఠి (3) ఉన్నారు.

  • 04 Apr 2022 09:36 PM (IST)

    బరిలోకి దిగిన విలియమ్సన్‌, అభిషేక్‌

    170 పరుగుల లక్ష్యంతో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. ఓపెనర్లుఆ అభిషేక్‌ శర్మ, కెప్టెన్‌ విలియమ్సన్‌ బరిలోకి దిగారు. మరోవైపు లక్నో తరఫున జేసన్‌ హోల్డర్‌ మొదటి బంతిని అందుకున్నాడు. మొదటి ఓవర్‌ లో బౌండరీ సహాయంతో 6 పరుగులు చేసింది హైద్రాబాద్‌.

  • 04 Apr 2022 09:20 PM (IST)

    రాహుల్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌.. లక్నో గౌరవప్రదమైన స్కోరు..

    లక్నో జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 169/7 పరుగులు చేసింది. కెప్టెన్‌ రాహుల్‌ (68) టాప్‌ స్కోరర్‌గా నిలవగా దీపక్‌ హుడా (51) అర్ధ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు నిరాశపరచడంతో లక్నో భారీ స్కోరు సాధించలేకపోయింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో నటరాజన్ (26/2), వాషింగ్టన్‌ సుందర్‌ ( 28/2), షెప్పర్డ్‌ (42/2) రాణించారు.

  • 04 Apr 2022 09:10 PM (IST)

    లక్నోకు డబుల్‌ షాక్‌ ఇచ్చిన నట్టూ.. కృనాల్‌ బౌల్డ్‌..

    హైద్రాబాద్‌ స్వింగ్‌ బౌలర్‌ నటరాజన్‌ లక్నోకు డబుల్‌ షాక్‌ ఇచ్చాడు. మొదట రాహుల్‌ను ఔట్‌ చేసిన అతను వెంటనే కృనాల్‌ పాండ్యా (6)ను బౌల్డ్‌ చేశాడు. దీంతో 151 పరుగుల వద్ద లక్నో ఆరో వికెట్‌ కోల్పోయింది.

  • 04 Apr 2022 09:08 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన లక్నో.. రాహుల్‌ను బోల్తా కొట్టించిన నటరాజన్‌..

    లక్నో జట్టు ఐదో వికెట్‌ కోల్పోయింది. నిలకడగా ఆడుతోన్న కెప్టెన్‌ రాహుల్‌ (68) నటరాజన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 18.3 ఓవర్లలో 150/5. క్రీజులో ఆయుష్‌ బదోని (11), కృనాల్‌ పాండ్యా (6) క్రీజులో ఉన్నారు.

  • 04 Apr 2022 08:54 PM (IST)

    కేఎల్‌ రాహుల్‌ హాఫ్‌ సెంచరీ..

    కెప్టెన్‌ రాహుల్‌ ముందుండి లక్నో జట్టును నడిపిస్తున్నాడు. నిలకడగా ఆడుతూ జట్టుకు భారీస్కోరు అందించేందుకు కృషిచేస్తున్నాడు. ఈక్రమంలోనే 40 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం లక్నో స్కోరు 16 ఓవర్లు ముగిసే సరికి 120/4. రాహుల్‌కు తోడుగా ఆయుష్‌ బదోని క్రీజులో ఉన్నాడు.

  • 04 Apr 2022 08:50 PM (IST)

    లక్నోకు బ్రేక్‌ ఇచ్చిన షెప్పర్డ్‌.. హుడా ఔట్‌..

    భారీ భాగస్వామ్యం (62 బంతుల్లో 87) దిశగా సాగుతోన్న రాహుల్‌, దీపక్‌ జోడీని షెప్పర్డ్‌ విడదీశాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన దీపక్‌ హుడా (51) బౌండరీ లైన్‌ వద్ద త్రిపాఠికి చిక్కాడు. దీంతో ఆజట్టు నాలుగో వికెట్‌ కోల్పోయింది. కాగా రాహుల్‌ సేన స్కోరు ప్రస్తుతం 15.2 ఓవర్లలో 115/4.

  • 04 Apr 2022 08:46 PM (IST)

    దీపక్‌ హుడా అర్ధ సెంచరీ..

    దీపక్‌ హుడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల సహాయంతో ఈ మార్క్‌ను చేరుకున్నాడు. మరోవైపు రాహుల్‌ (48) కూడా అర్ధ సెంచరీకి చేరువలో ఉన్నాడు.

  • 04 Apr 2022 08:40 PM (IST)

    రాహుల్‌, దీపక్‌ల మధ్య భారీ భాగస్వామ్యం..

    కెప్టెన్‌ రాహుల్‌ (48), దీపక్‌ హుడా (47) అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. వీరిద్దరూ అభేద్యమైన 4 వికెట్‌కు 55 బంతుల్లోనే 81 పరుగులు జోడించారు. ప్రస్తుతం లక్నో స్కోరు 14 ఓవర్లు ముగిసే సరికి 108/3.

  • 04 Apr 2022 08:20 PM (IST)

    నిలకడగా రాహుల్‌ బ్యాటింగ్‌.. 50 పరుగులు దాటిన లక్నో స్కోరు..

    లక్నో స్కోరు 50 పరుగులు దాటింది. కెప్టెన్‌ రాహుల్‌ (35), దీపక్‌ హుడా (20) నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం ఆ జట్టుస్కోరు 10 ఓవర్లు ముగిసే సరికి 68/3

  • 04 Apr 2022 07:58 PM (IST)

    మళ్లీ నిరాశపర్చిన మనీశ్‌..

    లక్నో మూడో వికెట్‌ కోల్పోయింది. ఫోర్‌, సిక్సర్‌ కొట్టి ఊపుమీదున్న మనీశ్‌ పాండే రొమారియో షెప్పర్డ్‌ బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 5 ఓవర్లకు 27/3. క్రీజులో రాహుల్‌ (14), దీపక్‌ హుడా (0) ఉన్నారు.

  • 04 Apr 2022 07:50 PM (IST)

    లక్నోను మరో ఝలక్‌ ఇచ్చిన సుందర్‌.. పెవిలియన్‌ చేరిన లూయిస్‌..

    హైదరాబాద్‌ బౌలర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ లక్నోకు మరో ఝలక్‌ ఇచ్చాడు. ఎవిన్‌ లూయిస్‌ (1) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది లక్నో. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్‌ రాహుల్‌ (14), మనీశ్‌ పాండే (0) క్రీజులో ఉన్నారు.

  • 04 Apr 2022 07:40 PM (IST)

    కేన్‌ మామ సూపర్‌ క్యా్‌చ్‌.. డికాక్‌ ఔట్‌..

    లక్నో మొదటి వికెట్‌ కోల్పోయింది. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ పట్టిన సూపర్‌ క్యాచ్‌కు స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (1) పెవిలియన్‌ చేరాడు. దీంతో కెప్టెన్‌ రాహుల్‌ బరిలోకి దిగాడు.

  • 04 Apr 2022 07:34 PM (IST)

    లక్నో తరపున జాసన్ హోల్డర్ అరంగేట్రం

    విండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ జాసన్ హోల్డర్ ఈ మ్యాచ్‌లో లక్నో తరఫున బరిలోకి దిగనున్నాడు. గత సీజన్లలో అతను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడే అదే జట్టుకు ప్రత్యర్థిగా మైదానంలో దిగనున్నాడు.

  • 04 Apr 2022 07:06 PM (IST)

    రెండు జట్లు..

    లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

    సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ (కీపర్), ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

  • 04 Apr 2022 06:43 PM (IST)

    Hyderabad vs Lucknow, LIVE Score: లక్నోతో పోరుకు సిద్ధమైన హైదరాబాద్

    ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తలపడనుంది. ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో ఐపీఎల్ 12వ మ్యాచ్ జరుగుతోంది.

Published On - Apr 04,2022 6:38 PM