Telugu News » Photo gallery » World Test Championship (WTC) Points Table After bangladesh lost to south africa in Telugu
WTC Points Table 2022 : బంగ్లాదేశ్‌పై విజయంతో రెండో స్థానానికి దక్షిణాఫ్రికా.. టీమిండియా ఏ ప్లేసులో ఉందంటే..
రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో ప్రస్తుతం దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. టీమిండియా మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు నాలుగు సిరీస్‌ల్లో 11 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఆరు మ్యాచ్‌లు గెలుపొందగా, మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. మరో నాలుగు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి . విజయాల శాతం 58.33.
1 / 5
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానంలో ఉంది. మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ ఐదు విజయాలు, మూడు డ్రాలతో అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో 72 పాయింట్లు ఉన్నాయి.
2 / 5
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 220 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌కు ముందు కూడా దక్షిణాఫ్రికా జట్టు రెండవ స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు విన్నింగ్ పర్సంటేజీని మరింత మెరుగుపర్చుకుంది.
3 / 5
ఏడో స్థానంలో వెస్టిండీస్ జట్టు ఉంది. ఈ జట్టు విజయాల శాతం 35.71గా ఉంది. ఇక బంగ్లాదేశ్ జట్టు ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక చివరి స్థానంలో ఇంగ్లండ్ జట్టు ఉంది.
4 / 5
लि44 పాయింట్లతో పాక్ జట్టు నాలుగో స్థానం ఉండగా ఐదో స్థానంలో శ్రీలంక ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ ఆరో ప్లేసులో ఉంది.