SRH vs LSG: స్టోయినిస్ నుంచి ఫిలిప్స్ వరకు.. నేటి మ్యాచ్‌లో కనిపించని దిగ్గజ ఆటగాళ్ళు వీరే..

IPL 2022, SRH vs LSG: ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలిపోరు జరుగుతుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

SRH vs LSG: స్టోయినిస్ నుంచి ఫిలిప్స్ వరకు.. నేటి మ్యాచ్‌లో కనిపించని దిగ్గజ ఆటగాళ్ళు వీరే..
Ipl 2022, Srh Vs Lsg
Follow us
Venkata Chari

|

Updated on: Apr 04, 2022 | 5:29 PM

IPL 2022, SRH vs LSG: ఐపీఎల్ 2022లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్, కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు నేడు ఒకదానితో ఒకటి తలపడనున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7.30 గంటల నుంచి ఇరు జట్ల మధ్య పోరు జరగనుంది. లక్నో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. అదే సమయంలో హైదరాబాద్ ఒక మ్యాచ్ ఆడింది. అందులో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా లక్నో, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.

తిరిగొచ్చిన జాసన్ హోల్డర్..

ఈ మ్యాచ్‌కు ముందు ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ జట్టులోకి రావడం లక్నోకు శుభవార్త. ఈరోజు అతను ప్లేయింగ్ XIలో కూడా భాగం కాగలడు. హోల్డర్ రాకతో లక్నో జట్టు మరింత పటిష్టంగా మారనుంది.

ఈ దిగ్గజ ఆటగాళ్లు నేటి మ్యాచ్‌లో ఆడడం లేదు..

జాసన్ హోల్డర్ ఈరోజు మైదానంలో కనిపించినప్పటికీ, జట్టుతో సంబంధం లేని చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడితే, ఆల్ రౌండర్ సీన్ అబాట్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ ఫిలిప్స్ నేటి మ్యాచ్‌లో భాగం కావడం లేదు. లక్నో గురించి మాట్లాడితే, ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా ఆడడం లేదు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI – కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.

లక్నో సూపర్ జెయింట్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI – కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీరా, అవేష్ ఖాన్.

Also Read: IPL 2022 Playoffs: లక్నో, అహ్మదాబాద్‌లోనే ప్లేఆఫ్ మ్యాచ్‌లు.. ఆ మైదానంలోనే ఫైనల్ పోరు?

IPL 2022: గత సీజన్‌లో హీరోలు.. ప్రస్తుతం జీరోలు.. ఫ్లాప్‌షోతో ఆకట్టుకోని ఆ ప్లేయర్స్ ఎవరంటే?