AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Playoffs: లక్నో, అహ్మదాబాద్‌లోనే ప్లేఆఫ్ మ్యాచ్‌లు.. ఆ మైదానంలోనే ఫైనల్ పోరు?

ఐపీఎల్ 2022 లీగ్ దశ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంతకు ముందు విడుదల చేసింది. దీని ప్రకారం అన్ని మ్యాచ్‌లు ముంబై, పూణేలో జరుగుతున్నాయి.

IPL 2022 Playoffs: లక్నో, అహ్మదాబాద్‌లోనే ప్లేఆఫ్ మ్యాచ్‌లు.. ఆ మైదానంలోనే ఫైనల్ పోరు?
Ipl 2022 Playoffs And Final Venue
Venkata Chari
|

Updated on: Apr 04, 2022 | 4:55 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) 15వ సీజన్ ఫైనల్, ప్లేఆఫ్ మ్యాచ్‌ల(IPL 2022 Playoffs)కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఐపీఎల్ 2022 లీగ్ దశ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంతకు ముందు విడుదల చేసింది. దీని ప్రకారం అన్ని మ్యాచ్‌లు ముంబై, పూణేలో జరుగుతున్నాయి. ఇప్పుడు ప్లే ఆఫ్ మ్యాచ్‌ల గురించి కీలక సమాచారం బయటకు వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం, ఐపీఎల్ 2022 ప్లేఆఫ్ మ్యాచ్‌లు లక్నో, అహ్మదాబాద్‌లలో జరగవచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టోర్నీలో రెండు కొత్త జట్లు చేరడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు.

ఫైనల్ అహ్మదాబాద్‌లో..

మీడియా నివేదికల ప్రకారం, ప్లేఆఫ్‌లోని మూడు మ్యాచ్‌లు లక్నోలోని భారతరత్న శ్రీ అలత్ విహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో నిర్వహించవచ్చని తెలుస్తోంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్ ఉంటుంది. అదే సమయంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టైటిల్ మ్యాచ్ అంటే ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

మే 29న ఫైనల్ మ్యాచ్..

IPL 2022 మార్చి 26 నుంచి ప్రారంభమైంది. అదే సమయంలో, టోర్నమెంట్ చివరి మ్యాచ్ మే 29 న జరుగుతుంది. పూణెలోని MCA స్టేడియంతో పాటు ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్, DY పాటిల్ స్టేడియాల్లో గ్రూప్ దశలోని అన్ని మ్యాచ్‌లు జరుగుతాయి.

Also Read: IPL 2022: గత సీజన్‌లో హీరోలు.. ప్రస్తుతం జీరోలు.. ఫ్లాప్‌షోతో ఆకట్టుకోని ఆ ప్లేయర్స్ ఎవరంటే?

IPL 2022: ఐపీఎల్‌లో మూడు వరుస ఓటములు.. CSK కెప్టెన్ రవీంద్ర జడేజా ఏమన్నారంటే..?