AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T-Congress Leaders: హస్తినకు చేరిన టీ కాంగ్రెస్‌ నేతల పంచాయతీ.. కాసేపట్లో రాహుల్ గాంధీతో భేటీ

తెలంగాణ(Telangana) వర్గపోరు పంచాయతీ ఢిల్లీకి చేరింది. టీ - కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. పీసీసీ చీఫ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి, అధిష్ఠానికి పరస్పర ఫిర్యాదులు చేశారు. మరో వైపు వ్యూహకర్త సునీల్ కుమార్...

T-Congress Leaders: హస్తినకు చేరిన టీ కాంగ్రెస్‌ నేతల పంచాయతీ.. కాసేపట్లో రాహుల్ గాంధీతో భేటీ
Telangana Congress
Ganesh Mudavath
|

Updated on: Apr 04, 2022 | 7:06 PM

Share

తెలంగాణ(Telangana) వర్గపోరు పంచాయతీ ఢిల్లీకి చేరింది. టీ – కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. పీసీసీ చీఫ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి, అధిష్ఠానికి పరస్పర ఫిర్యాదులు చేశారు. మరో వైపు వ్యూహకర్త సునీల్ కుమార్(Sunil Kumar Report) రిపోర్ట్ కీలకంగా మారింది. ఈ క్రమంలో కాసేపట్లో రాహుల్ గాంధీతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. 38 మంది కీలక కాంగ్రెస్‌ నేతలు(Congress Leaders) రాహుల్‌ గాంధీతో భేటీకి హాజరుకానున్నారు. పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యులు, పీసీసీ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రులు ఈ సమావేశానికి హాజరుకావాలని ఏఐసీసీ నుంచి పిలుపొచ్చింది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వి.హనుమంతరావు, జగ్గారెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించి ఢిల్లీ చేరుకున్నారు.

పార్టీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ చర్చించనున్నారు. టీఆర్ఎస్, బీజేపీ లను ఎలా ఎదుర్కోవాలి? ప్రజా సమస్యలపై ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి వంటి అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాహుల్‌ అవకాశమిస్తే పీసీసీపై ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్‌ సీనియర్లు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సమావేశంలో ఏం జరగబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.

తెలంగాణ ఎన్నికలకు ముందు పార్టీలో ఉత్సాహాన్ని నింపేందుకు టీపీసీసీ ప్రయత్నిస్తుంటే.. అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువగా వుండే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తాడును మరోవైపు లాగేందుకు యత్నిస్తున్నారు. దానికి వారు చూపుతున్న కారణాలు సహేతుకంగా కనిపిస్తున్నా ఏమీ చేయలేని స్థితిలో అధిష్టానం వున్నట్లు తెలుస్తోంది. అందరినీ కలుపుకుని పోయే నేతకే పీసీసీ పగ్గాలివ్వాలని, వ్యక్తిగత షోల ద్వారా పార్టీకి విజయాన్ని సాధించలేమని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు. అయితే.. అచంచల విశ్వాసంతో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలను కట్టబెట్టిన అధిష్టానం ఆయన సారథ్యంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్ళనున్నట్లు సంకేతాల్నిస్తోంది.

Also Read

Hyderabad Drugs Case: వెలుగులోకి వస్తున్న పుడింగ్ అండ్ మింగ్ పబ్ ఆగడాలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు

Viral Video: ఇదేందయ్యా ఇది! దర్జాగా డీజిల్ కొట్టించుకున్నాక ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే మీటర్ లేచుద్ది!

AP Revenue deficit: రెవెన్యూ లోటు కింద ఏపీకి కేంద్రం ఇప్పటివరకు ఎంత ఇచ్చిందంటే.. ?