Viral Video: చిరుతకు చుక్కలు చూపించిన అడవి పంది.. ప్రాణ భయంతో చిరుత పరుగో పరుగు..!
సాధారణంగా అడవిలో అత్యంత క్రూర మృగాలు ఏవి అంటే టక్కున గుర్తుకొచ్చేవి సింహం, పులి, చిరుత. ఎందుకంటే.. అడవిలో జీవించే ఏ జీవి అయినా వీటిని చూస్తే హడలిపోతాయి. పొరపాటున వాటి కంట పడ్డాయో అదే వాటికి చివరి రోజు అవుతుంది. కానీ, ఒక్కోసారి సీన్ రివర్స్ అవుతుంటుంది.
సాధారణంగా అడవిలో అత్యంత క్రూర మృగాలు ఏవి అంటే టక్కున గుర్తుకొచ్చేవి సింహం, పులి, చిరుత. ఎందుకంటే.. అడవిలో జీవించే ఏ జీవి అయినా వీటిని చూస్తే హడలిపోతాయి. పొరపాటున వాటి కంట పడ్డాయో అదే వాటికి చివరి రోజు అవుతుంది. కానీ, ఒక్కోసారి సీన్ రివర్స్ అవుతుంటుంది. కొన్ని జంతువులు ధైర్యం తెచ్చుకుని మరీ ఈ క్రూర మృగాలకు ఎదురు తిరుగుతాయి. వాటితో పోరాడి ప్రాణాలు దక్కించుకుంటాయి. ముఖ్యంగా తమ పిల్లలపై దాడి చేసినప్పుడు అవి ఎక్కడ లేని శక్తిని తెచ్చుకుని పోరాటం సాగిస్తాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అడవి పంది.. తన బిడ్డపై దాడి చేసిన చిరుత పులికి చుక్కలు చూపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో అడవిలోని మైదాన ప్రాంతంలో పంది పిల్ల మేత మేస్తోంది. దీనిని గమనించిన చిరుత పులి.. తనకు ఈ పూటకు ఆహారం దొరికిందని సంబరపడిపోయింది. నేరుగా అటాక్ చేసి.. పంది పిల్లను నోట కరుచుకుని పరుగులు తీసింది. అయితే, అటువైపు నుంచి ఈ దృశ్యాన్ని చూసిన తల్లి పంది.. చిరుతపై అటాక్ చేయబోయింది. తల్లి పంది రాకను గమనించిన చిరుత.. ప్రాణ భయంతో పంది పిల్లను వదిలేసి పరుగులు తీసింది. అయినప్పటికీ ఆ తల్లి పంది వదల్లేదు. దానిని ఒక రేంజ్‌లో ఉరికించింది. ఈ సన్నివేశాన్ని సఫారీలో ప్రయాణిస్తున్న పర్యాటకులు కెమెరాల్లో రికార్డ్ చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో వీక్షిస్తున్న లక్షలమంది నెటిజన్లు అడవి జంతువుల జీవితంపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తల్లి ప్రేమపై ప్రశంసలు కురిపిస్తూ.. ఆ తల్లి పంది ధైర్యానికి సలామ్ కొడుతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్..
అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్ జాక్సన్ స్టెప్ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్…
Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..
Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..
Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

