Ananya Panday: ఆ యంగ్‌ హీరోకు కటీఫ్‌ చెప్పేసిన లైగర్‌ బ్యూటీ! మూడేళ్ల ప్రేమ బంధానికి గుడ్‌బై..

Ananya Panday- Ishaan Khattar: స్టైలిష్‌ విలన్‌ చుంకీపాండే వారసురాలిగా అడుగపెట్టినా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనన్యా పాండే. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌2 తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత పతీ పత్నీ ఔర్‌ ఓ, ఖాలీ పీలి, గెహ్రాయియా సినిమాలతో ..

Ananya Panday: ఆ యంగ్‌ హీరోకు కటీఫ్‌ చెప్పేసిన లైగర్‌ బ్యూటీ! మూడేళ్ల ప్రేమ బంధానికి గుడ్‌బై..
Ananya Panday
Follow us
Basha Shek

|

Updated on: Apr 05, 2022 | 9:47 AM

Ananya Panday- Ishaan Khattar: స్టైలిష్‌ విలన్‌ చుంకీపాండే వారసురాలిగా అడుగపెట్టినా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనన్యా పాండే. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌2 తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత పతీ పత్నీ ఔర్‌ ఓ, ఖాలీ పీలి, గెహ్రాయియా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే ప్రేమ వ్యవహారంతో కూడా వార్తల్లో నిలిచిందీ ఈ ముద్దుగుమ్మ. స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సోదరుడు, యంగ్‌ హీరో ఇషాన్‌ ఖట్టర్‌ (Ishaan Khattar)తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఖాళీపీలి సినిమా సమయంలో మొదటిసారిగా కలుసుకున్న వీరిద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. టూర్లు, వెకేషన్లు, డిన్నర్‌ డేట్స్ అంటూ జంటగా కలియతిరిగారు. ఇక కొన్నిరోజుల క్రితమే షాహిద్ బర్త్ డే పార్టీలో కూడా సందడి చేసింది అనన్య (Ananya Panday). ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ కూడా అయ్యాయి. ఇక ఇటీవల ఇషాన్‌ తల్లి నీలిమా సైతం అనన్య తమ కుటుంబంలో ఒక మెంబర్‌ అంటూ ప్రేమను కురిపించింది. అయితే తమ డేటింగ్‌ విషయంపై అటు అనన్య, ఇషాన్‌ కానీ ఎక్కడా బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

కాగా మూడేళ్లు ప్రేమలో మునిగితేలుతోన్న అనన్య-ఇషాన్‌లు విడిపోయారని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నా్యి. ఇద్దరి మధ్య సఖ్యత కొరవడిందని, ఆలోచనలు కూడా వేర్వురుగా ఉండడంతో పరస్పరం అంగీకారంతో బ్రేకప్‌ చెప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా కలిసుంటామని అవకాశం వస్తే కలిసి సినిమాల్లో నటిస్తామని చెబుతున్నారట. బాగా ఆలోచించే బ్రేకప్‌ నిర్ణయం తీసుకున్నామని, ఈ విషయంలో పూర్తి మెచ్యూరిటీతో వ్యవహరిద్దామని ఈ జోడీ అనుకుందట. ఇక త్వరలోనే టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం కానుంది అనన్య. విజయ్‌దేవరకొండతో పూరిజగన్నాథ్‌ తెరకెక్కిస్తోన్న లైగర్‌ సినిమాలో ఆమె హీరోయిన్‌ గా నటిస్తోంది. ఆగస్టులోఈ చిత్రం విడుదల కానుంది.

Also Read:Viral Video: చిరుతకు చుక్కలు చూపించిన అడవి పంది.. ప్రాణ భయంతో చిరుత పరుగో పరుగు..!

Special MangoTree: ఈ మామిడి చెట్టుకి Z + కి మించిన సెక్యూరిటీ.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

Special MangoTree: ఈ మామిడి చెట్టుకి Z + కి మించిన సెక్యూరిటీ.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!