AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

150 అడుగులు గాల్లోకి ఎగిరి టీ ఎస్టేట్‌లో పడిన కారు.. భయంతో పరుగులు పెట్టిన జనం.. తీరా చూస్తే

ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతాయో చెప్పలేం.. ఇటీవల కాలంలో ఊహించని ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కారు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

150 అడుగులు గాల్లోకి ఎగిరి టీ ఎస్టేట్‌లో పడిన కారు.. భయంతో పరుగులు పెట్టిన జనం.. తీరా చూస్తే
Ooty Tea Estate
Rajeev Rayala
|

Updated on: Apr 05, 2022 | 9:33 AM

Share

ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతాయో చెప్పలేం.. ఇటీవల కాలంలో ఊహించని ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కారు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మితిమీరిన వేగంతో ప్రమాదాలు గురవుతున్నారు జనాలు. తాజాగా ఓ కారు ఏకంగా 150 అడుగుల ఎత్తుకు ఎగిరిపడింది. తీరా అసలు విషయం తెలిసి అందరు షాక్ అయ్యారు. అసలు విషయం తెలిసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు విషయం ఏంటంటే.. అక్కడ జరిగింది ప్రమాదం కాదు సినిమా షూటింగ్..

తాజాగా ఓ సినిమా కోసం జరిగిన షూటింగ్ ప్రజలను భయంతో పరుగులు పెట్టించింది. ఓ యాక్షన్ సీన్ కోసం చేసిన షూటింగ్ చూసి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి మరి ప్రమాదం జరిగిందని చెప్పారు. తీరా పోలీసులు వచ్చి  చూస్తే అది సినిమా షూటింగ్ అని తెలిసింది. కింగ్ నాగార్జున నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఘోస్ట్ సినిమా షూటింగ్ ఊటీలో శరవేగంగా జరుగుతుంది. ఓ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన సీన్ ను చిత్రీకరిస్తున్నారు చిత్రయూనిట్ ఈ సందర్భంగా ఓ కారును గాలిలోకి లేపారు స్టెంట్ మాస్టర్.

సినిమా షూటింగ్ స్టంట్ తో ఉల్లిక్కిపడ్డరు ఊటీ టీ ఎస్టేట్ కార్మికులు. యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా ఓ కారు గాలిలోకి లేచి పడాలి.. దాంతో ఈ క్రమంలో కారు బ్లాస్ట్ సన్నివేశాలలో కారు 150 అడుగుల ఎత్తుకి లేచి టీ ఎస్టేట్ లో పడింది. దాంతో అక్కడ ఉన్న జనం ఒక్కసారిగా కారు ప్రమాదం జరిగిందని భావించి భయంతో పరుగులు పెట్టారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి చూడగా అది సినిమా షూటింగ్ అని తెలిసింది. పోలీస్ విచారణలో సినిమా షూటింగ్ లో కారు స్టంట్ చిత్రీకరిస్తునట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. దాంతో అక్కడి స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి సినిమా షూటింగ్ ఊటీ టీ ఎస్టేట్ కార్మికులను ఉల్లిక్కిపడేలా చేసింది.

Follow Us
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
మార్షల్‌ ఆర్ట్స్‌లో మెరిసిన భారత్.. ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం!
మార్షల్‌ ఆర్ట్స్‌లో మెరిసిన భారత్.. ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
శ్రీపెరుంబూదూర్ ప్రతిరూపం: 240 ఏళ్ల నాటి ‘అభినవ భూతపురి’ విశేషాలు
శ్రీపెరుంబూదూర్ ప్రతిరూపం: 240 ఏళ్ల నాటి ‘అభినవ భూతపురి’ విశేషాలు
వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే తోపు మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠే
వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే తోపు మ్యాచ్.. చివరి బంతి వరకు ఉత్కంఠే
అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం..
అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం..
అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!
అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!
బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ అతడే..
బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ అతడే..