AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్‌కు దెబ్బమీద దెబ్బ..! జన నాయగన్ మూవీ వీడియోలు లీక్.. నెట్టింట దుమారం

దళపతి విజయ్ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి విజయ్ కు ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి.బహిరంగ సభలో పలువురు మరణించడం, చివరిగా చేసిన జననాయగన్ సినిమా విడుదలకు నోచుకోకపోవడం, సరిగ్గా ఎలక్షన్స్ సమయానికి కట్టుకున్న భార్య విడాకులు కోరడంతో విజయ్ కుదెబ్బమీద దెబ్బ తగిలినట్టు అయ్యింది.

విజయ్‌కు దెబ్బమీద దెబ్బ..! జన నాయగన్ మూవీ వీడియోలు లీక్.. నెట్టింట దుమారం
Thalapathy Vijay
Rajeev Rayala
|

Updated on: Apr 10, 2026 | 12:21 PM

Share

దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయ్ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన చివరి చిత్రం జన నాయగన్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యారు. ఈ సినిమా అన్ని పూర్తి చేసుకున్న విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. సెన్సార్ ఇబ్బందుల కారణంగా సినిమా ఇంకా విడుదల కాలేదు. దాంతో విజయ్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు మరో కష్టం వచ్చిందని తెలుస్తుంది. జన నాయగన్ సినిమా ఇంటర్ నెట్ లో లీక్ అవడంతో ఇప్పుడు గందరగోళం నెలకొంది. జన నయగాన్ సినిమాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వడంతో చిత్రయూనిట్ షాక్ అయ్యింది.

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

జన నాయగాన్ సినిమాలోని కీలక సన్నివేశాలు లీక్ అయ్యాయని తెలుస్తుంది. యాక్షన్ సీన్స్ తోపాటు, విజయ్ ఎంట్రీ సీన్స్, అలాగే ఓ సాంగ్ లీక్ అయ్యాయి. దాదాపు 48నిమిషాల ఫుట్టేజ్ లీక్ అవ్వడంతో చిత్రయూనిట్ తలపట్టుకుంటున్నారు. విజయ్‌ను మానసికంగా దెబ్బతీసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే విజయ్ కు దెబ్బమీద దెబ్బ తగులుతుంది.

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

ఇప్పటికే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఎన్నో రకాల వివాదాలు తలెత్తుతున్నాయి. సభలో కొందరు చనిపోవడం, విజయ్ భార్య ఆయన పై ఆరోపణలు చేయడం, జననాయగన్  సినిమా విడుదలకు నోచుకోకపోవడం ఇలా వరసగా ఎదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇక ఇప్పుడు సినిమా లీక్ అవ్వడం పెద్ద దుమారంరేపింది . దీని పై విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us