AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shresta Iyer : ఆ ఒక్క వీడియో కొంపముంచింది.. శ్రేయస్ అయ్యర్ సోదరిని ఆడుకుంటున్న కేకేఆర్ ఫ్యాన్స్

Shresta Iyer : కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సరదా వీడియో పోస్ట్ చేసింది. అది ప్రస్తుతం వివాదాలకు దారి తీసింది.

Shresta Iyer : ఆ ఒక్క వీడియో కొంపముంచింది.. శ్రేయస్ అయ్యర్ సోదరిని ఆడుకుంటున్న కేకేఆర్ ఫ్యాన్స్
Shreyas Iyer
Rakesh
|

Updated on: Apr 10, 2026 | 12:13 PM

Share

Shresta Iyer : ఐపీఎల్ క్రేజ్ ఒక్కోసారి హద్దులు దాటుతోంది. మైదానంలో ఆటగాళ్ల మధ్య ఉండే పోటీ, బయట అభిమానుల మధ్య యుద్ధంగా మారుతోంది. తాజాగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ సోషల్ మీడియాలో తీవ్ర వేధింపులకు గురవ్వడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక చిన్న సరదా వీడియో ఆమె కొంపముంచింది. చివరకు నెటిజన్ల ట్రోలింగ్ భరించలేక ఆమె తన వీడియోను డిలీట్ చేయడమే కాకుండా, ఘాటుగా స్పందించింది.

అసలు వివాదం ఏంటి?

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సరదా వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె పంజాబీ భాషలో మాట్లాడుతూ.. పంజాబీల మనసు చాలా పెద్దది, అందుకే మీకు ఒక పాయింట్ ఇచ్చేశాం అని పంజాబ్ భాషలో చమత్కరించింది.

ట్రోలింగ్, బెదిరింపులు

ఈ వీడియో కాస్తా వైరల్ అవ్వడంతో కేకేఆర్ అభిమానులు హర్ట్ అయ్యారు. ఆమె వాడిన వ్యంగ్య స్వరం తమ జట్టును అవమానించినట్లు ఉందని భావించిన కొందరు నెటిజన్లు శ్రేష్ఠపై విరుచుకుపడ్డారు. ఆమె పోస్టుల కింద అసభ్యకర కామెంట్లు చేయడమే కాకుండా, కొందరు ఏకంగా బెదిరింపు సందేశాలు పంపడం కలకలం రేపింది. దీంతో పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన శ్రేష్ఠ వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసింది.

శ్రేష్ఠ అయ్యర్ వివరణ

వీడియో తొలగించిన తర్వాత ఆమె మరో పోస్ట్ పెడుతూ తన బాధను వ్యక్తపరిచింది. “నేను పెట్టిన వీడియోను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని అనిపిస్తోంది. అది కేవలం సరదాగా చేసిన వ్యాఖ్య మాత్రమే. కానీ కొందరి నుంచి నెగటివిటీతో పాటు బెదిరింపులు కూడా రావడం నన్ను చాలా బాధించింది. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశ్యం నాకు లేదు. నేను తప్పు చేశానని వీడియో డిలీట్ చేయడం లేదు, నా అన్నయ్యకు, అతని జట్టుకు ఎలాంటి చెడ్డ పేరు రావొద్దనే ఉద్దేశ్యంతోనే తీసేశాను. ప్లీజ్.. ఒకరిపై ఒకరు దయ చూపిద్దాం” అంటూ రాసుకొచ్చింది.

ఐపీఎల్ ఉద్రిక్తతలు

ఐపీఎల్ లాంటి హై-వోల్టేజ్ టోర్నమెంట్లలో అభిమానుల మధ్య పోటాపోటీ ఉండటం సహజమే కానీ, అది ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలను, వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్లడం విచారకరం. గతంలోనూ పలువురు ఆటగాళ్ల భార్యలు, సోదరీమణులు ఇలాగే సోషల్ మీడియా వేధింపులకు గురైన సందర్భాలు ఉన్నాయి. క్రీడను క్రీడలా చూడాలని, వ్యక్తిగత దూషణలకు పాల్పడకూడదని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us