AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant: రిషభ్ పంత్‌కు బిగ్ షాక్! ఐపీఎల్ ట్రేడ్ డీల్.. బయటపడ్డ సంచలన నిజాలు

రిషభ్ పంత్ లక్నో సూపర్‌ జెయింట్స్ నుంచి తన సొంతగూడైన ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వచ్చాడు. ఈ ట్రేడ్ డీల్‌లో భాగంగా కుల్దీప్ యాదవ్‌ను లక్నోకు ఇచ్చింది ఢిల్లీ. ఐపీఎల్ అధికారికంగా ప్రకటించిన ఈ మార్పిడిలో పంత్ గతంలో రూ.27 కోట్లు పొందగా, ఇప్పుడు రూ.15 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Rishabh Pant: రిషభ్ పంత్‌కు బిగ్ షాక్! ఐపీఎల్ ట్రేడ్ డీల్.. బయటపడ్డ సంచలన నిజాలు
Delhi Capitals Trade Deal
SN Pasha
|

Updated on: Jun 23, 2026 | 5:13 PM

Share

అంతా ఊహించినట్టుగానే జరిగింది. పంత్ లక్సో సూపర్ జెయింట్స్‌ను వదిలేసి, తన సొంతగూటికి చేరిపోయాడు. ట్రేడ్ డీల్‌లో భాగంగా రిషభ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. బదులుగా తమ టీమ్‌లో ఉన్న వరల్డ్ క్లాస్ క్వాలిటీ స్పిన్నర్, చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను ఎల్ఎస్‌జీకి ఇచ్చేసింది. ఈ ట్రేడ్ జరుగుతుందనే విషయం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగిపోతూనే ఉంది. పలు వార్తా సంస్థలు కూడా ఈ ట్రేడ్ డీల్ గురించి ముందుగానే లీకులు ఇచ్చేశాయి. అయితే తాజాగా ఐపీఎల్ ఎక్స్ అకౌంట్ నుంచి ఈ డీట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

అయితే ఈ ట్రేడ్ డీల్‌లో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. పంత్‌కు చెల్లించబోయే ధర. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడి రికార్డు పంత్ పేరిటే ఉంది. లక్నో అతనికి ఏకంగా రూ.27 కోట్లు చెల్లించింది. అలా ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ ట్రేడ్ డీల్‌లో మాత్రం పంత్ ధర భారీగా తగ్గింది. గత సీజన్‌లో రూ.27 కోట్లు అందుకున్న పంత్.. వచ్చే సీజన్‌లో అంటే ఐపీఎల్ 2027లో మాత్రం కేవలం రూ.15 కోట్లు మాత్రమే పొందనున్నాడు. అలాగే కుల్దీప్ యాదవ్‌కు లక్నో సూపర్ జెయింట్స్ రూ.13.5 కోట్లు చెల్లించనుంది.

2016 నుండి 2024 మధ్య తొమ్మిది సీజన్ల పాటు పంత్ ఢిల్లీ టీమ్‌కు ఆడిన విషయం తెలిసిందే. డీసీ తరఫున 111 మ్యాచ్‌‌లు ఆడాడు. దాదాపు దశాబ్ద కాలంగా ఈ ఫ్రాంచైజీకి ఒక కీలకమైన ఆటగాడిగా ఉన్న అతను, 2021 నుండి 2024 వరకు నాలుగు సీజన్లలో 43 మ్యాచ్‌లకు జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2025 వేలంలో పంత్‌ను ఎల్‌ఎస్‌జి జట్టు రికార్డు స్థాయిలో 27 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఈ ట్రేడ్ తర్వాత అతను రూ.15 కోట్లకు సవరించిన ఫీజుతో డిసి జట్టులో తిరిగి చేరనున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు