AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi : షార్ట్ బాల్ చూస్తే చాలు.. బుడ్డోడు బుక్ కాకుండా మరో టెక్నిక్ చెప్పిన మాజీ క్రికెటర్

Vaibhav Sooryavanshi : జింబాబ్వేతో రెండో టీ20లో షార్ట్ బాల్‌కు మరోసారి వికెట్ కోల్పోయిన వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ సబా కరీమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నిక్‌లో సమస్య లేదని, మ్యాచ్ అవేర్‌నెస్ పెంచుకుంటే భవిష్యత్తులో స్టార్‌గా ఎదుగుతాడని పేర్కొన్నారు.

Vaibhav Sooryavanshi : షార్ట్ బాల్ చూస్తే చాలు.. బుడ్డోడు బుక్ కాకుండా మరో టెక్నిక్ చెప్పిన మాజీ క్రికెటర్
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Jul 26, 2026 | 1:07 PM

Share

Vaibhav Sooryavanshi : భారత యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి షార్ట్ బాల్ బలహీనత కారణంగా పెవిలియన్ బాట పట్టాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో వైభవ్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో కూడా షార్ట్ బాల్ ఎదుర్కొనే క్రమంలోనే ఆయన తన వికెట్‌ను కోల్పోయాడు. అంతకుముందు ఇంగ్లాండ్ పర్యటనలో కూడా స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ షార్ట్ బాల్స్‌తో వైభవ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టి వికెట్ తీశాడు. రెండు విభిన్న పరిస్థితుల్లోనూ వరుసగా షార్ట్ బాల్స్ ద్వారానే ఔట్ అవ్వడంతో, ప్రత్యర్థి జట్లు వైభవ్ కోసం ఒక స్పెషల్ ప్లాన్ సిద్ధం చేశాయా అనే చర్చ క్రికెట్ వర్గాల్లో మొదలైంది.

సబా కరీమ్ కీలక విశ్లేషణ

వైభవ్ సమస్యపై భారత మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ సబా కరీమ్ స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో ప్రతి ఫాస్ట్ బౌలర్ కూడా వైభవ్ సూర్యవంశీకి వ్యతిరేకంగా షార్ట్ బాల్స్ వేసే వ్యూహాన్ని అమలు చేస్తారని అభిప్రాయపడ్డారు. అయితే ఈ సవాలును అధిగమించే మార్గాన్ని వైభవే స్వయంగా వెతుక్కోవాల్సి ఉంటుందన్నారు. వైభవ్ వద్ద ఉన్న నైపుణ్యం, అపారమైన ప్రతిభను బట్టి చూస్తే, ఈ చిన్న బలహీనతను ఆయన త్వరలోనే అధిగమిస్తాడనే నమ్మకం తనకు ఉందని సబా కరీమ్ తెలిపారు. ప్రతి ఆటగాడు తన తప్పులను గుర్తించి సరిదిద్దుకున్నప్పుడే అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కెరీర్ సాధ్యమవుతుందని గుర్తుచేశారు.

విదేశీ పిచ్‌లపై బౌన్స్ పరీక్ష

నేటి ఆధునిక క్రికెట్‌లో ప్రతి జట్టు ప్రత్యర్థి బ్యాటర్ల బలబలాలు, బలహీనతలపై విశ్లేషణ చేసి వ్యూహాలు రచిస్తుందని సబా కరీమ్ చెప్పారు. భారత పిచ్‌లపై సాధారణంగా అదనపు బౌన్స్ లభించదు కానీ, విదేశీ పిచ్‌లపై బంతి ఎక్కువగా బౌన్స్ అవుతుంది. కాబట్టి షార్ట్ బాల్స్ వచ్చినప్పుడు ఎలాంటి షాట్ ఆడాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. అయితే వైభవ్ షార్ట్ బాల్స్ అస్సలు ఆడలేడని భావించడం తప్పని, టి20 మ్యాచ్‌ల్లో త్వరగా పరుగులు సాధించాలనే ఒత్తిడి వల్ల రిస్క్ తీసుకుని వికెట్ కోల్పోతుంటారని సబా కరీమ్ వ్యాఖ్యానించారు.

టెక్నిక్‌లో లోపం లేదు.. మ్యాచ్ అవేర్‌నెసే ముఖ్యం

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎలాంటి పెద్ద లోపం లేదని సబా కరీమ్ స్పష్టం చేశారు. ఇటీవల వైభవ్ అప్పర్ కట్ వంటి షాట్లను ప్రాక్టీస్ చేస్తూ తన ఆటను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడని మెచ్చుకున్నారు. జింబాబ్వే మ్యాచ్‌లో అవుట్ అవ్వడం టెక్నిక్ లోపం వల్ల కాదు, షాట్ ఎంపిక సరిగ్గా లేకపోవడం వల్ల జరిగింది. బౌలర్ వైపు కొద్దిగా ముందుకు వచ్చి హుక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడని, అయితే బంతి ఊహించిన దానికంటే వేగంగా రావడంతో వికెట్ కోల్పోయాడని వివరించారు. లెగ్ సైడ్‌లో ఇద్దరు ఫీల్డర్లు ఉన్నప్పుడు హుక్ షాట్ ఆడటం సరైన నిర్ణయం కాదని, మ్యాచ్ పరిస్థితిని బట్టి షాట్లను ఎంచుకునే మ్యాచ్ అవేర్‌నెస్ పెంచుకుంటే వైభవ్ భవిష్యత్తులో స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బుడ్డోడు బుక్ కాకుండా మరో టెక్నిక్ చెప్పిన మాజీ క్రికెటర్
బుడ్డోడు బుక్ కాకుండా మరో టెక్నిక్ చెప్పిన మాజీ క్రికెటర్
హైదరాబాద్‌లో సొంతింటి కల.. మీ బడ్జెట్‌లో ఇల్లు పొందే..
హైదరాబాద్‌లో సొంతింటి కల.. మీ బడ్జెట్‌లో ఇల్లు పొందే..
'గబ్బర్ సింగ్’ రమేష్‌కు అండగా మెగా ఫ్యామిలీ..5లక్షల సాయంతో పాటు..
'గబ్బర్ సింగ్’ రమేష్‌కు అండగా మెగా ఫ్యామిలీ..5లక్షల సాయంతో పాటు..
కలలో కొత్త ఇల్లు కనిపిస్తే శుభమా? అశుభమా? స్వప్న శాస్త్రం ఏమి..
కలలో కొత్త ఇల్లు కనిపిస్తే శుభమా? అశుభమా? స్వప్న శాస్త్రం ఏమి..
వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా!
వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా!
కలల కోసం అమెరికా.. క్షణాల్లో కూలిన జీవితం..!
కలల కోసం అమెరికా.. క్షణాల్లో కూలిన జీవితం..!
నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?
నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?
అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు..
అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు..
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే
సింహం వేటను ఎలా చంపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
సింహం వేటను ఎలా చంపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..