AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నయన్ ను చూసి అలర్ట్ అవుతున్న హీరోయిన్లెవరు ??

నయన్ ను చూసి అలర్ట్ అవుతున్న హీరోయిన్లెవరు ??

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 09, 2026 | 7:40 PM

Share

నయనతార తన రీ-ఎంట్రీతో దక్షిణాది సినీ పరిశ్రమలో దూసుకుపోతోంది. భారీ విజయాలతో పీర్ గ్రూప్‌కు ఆమె ఓ అలర్ట్‌గా మారింది. అయితే, గతంలో పోటీ పడిన త్రిష, అనుష్క, తమన్నా వంటి సీనియర్ హీరోయిన్లు మాత్రం కెరీర్ పరంగా కాస్త వెనుకబడ్డారు. కొత్త సినిమాలు, సరైన విజయాలు లేక వారి కెరీర్ గ్రాఫ్ మందగిస్తోంది. ఇండస్ట్రీలో నిలబడటానికి పీర్ గ్రూప్‌ను గమనించడం ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది.

ఇండస్ట్రీలో మనం ఎలా ఉన్నాం? సక్సెస్‌లోనే ఉన్నామా? ఫ్లో లో పడి కొట్టుకుపోతున్నామా? ఒక్కసారి ఆగి మనల్ని మనం చెక్‌ చేసుకోవాలా? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే బ్రహ్మాండాల్ని బద్ధలు కొట్టక్కర్లేదు. మన పీర్ గ్రూప్‌ వైపు ఓ సారి లుక్కేస్తే చాలు… ఇంతకీ సీనియర్లు ఆ పని చేస్తు్న్నారా? సినిమాలు ఇక చేయను అని కెరీర్‌లో ఓ సారి అనౌన్స్ చేసిన నయన్‌, రీ ఎంట్రీ ఇచ్చాక మాత్రం తిరిగి చూసుకోవడం లేదు. భారీ లైనప్‌, కలర్‌ఫుల్‌ సక్సెస్‌లతో దూసుకుపోతున్నారు. పీర్‌ గ్రూప్‌ నాయికలకు నయన్‌ని చూస్తే ఓ అలర్ట్ మాత్రం కచ్చితంగా వచ్చి తీరుతుందని అంటున్నారు క్రిటిక్స్. నయన్‌తో ఎప్పుడూ పోటీ పడే త్రిష ఇప్పుడు ఎందుకో కాస్త సైలెంట్‌ అయ్యారు. ఆ మధ్య పొన్నియిన్‌ సెల్వన్‌ తర్వాత త్రిష దూసుకొచ్చేయడం ఖాయమనే అనుకున్నారంతా. కానీ, ఆమె నటించిన కరుప్పు, విశ్వంభర, రామ్‌ మూవీ రిలీజులు కాస్త నిదానించడంతో త్రిష కెరీర్‌లోనూ ఆ ఊపు కనిపించడం లేదిప్పుడు. ప్యాన్‌ ఇండియా హీరోయిన్లున్నా ఇప్పుడున్నవారందరూ చలామణి కాకముందే ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో సత్తా చూపించిన హీరోయిన్‌ అనుష్క. ఆ మధ్య పెరిగిన బరువు తగ్గడం కోసం ప్రయత్నాలు చేస్తూ సినిమాలు స్లో చేశారు. మధ్యలో మిస్‌ శెట్టితో క్లిక్‌ అయినా.. ఆ లక్‌ని కంటిన్యూ చేసుకోలేకపోయారు. బాహుబలితో మెప్పించిన మరో సీనియర్‌ బ్యూటీ తమన్నా కూడా కెరీర్‌లో సడన్‌గా స్లో అయినట్టున్నారు. బిఫోర్‌ ధురంధర్‌ స్పెషల్‌ సాంగులకు కేరాఫ్‌గా మారిపోయారు తమన్నా. కానీ, ఇప్పుడు ఆమెలో ఆ జోరు మిస్‌ అయిందనే అంటున్నారు అబ్జర్వర్స్. సీనియర్లలో కాజల్‌, శ్రియలాంటివారు కూడా ఇప్పుడు కెరీర్‌లో వెనకబడ్డారన్నది అందరూ ఒప్పుకుంటున్న విషయం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Raaka: క్రూరుడు.. కత్తిలాంటి కుర్రాడు.. బన్నీ డ్యుయల్ రోల్

‘అటు మామ.. ఇటు బావ..’ అబ్బో.. ఖుషీగా బన్నీ

TOP 5 ET: ఆయనే ముందు ప్రపోజ్ చేశారు.. – అన్నా

Virat Kohli: ధురంధర్‌కి విరాట్‌ ఫిదా.. నీలాగే నేను కూడా అంటూ.. డైరెక్టర్‌ ట్వీట్

అదిరిందయ్యా చంద్రం! ‘ఎర్త్‌రైజ్’, ‘ఎర్త్‌సెట్’ చూసారా ??

Follow Us