Virat Kohli: ధురంధర్‌కి విరాట్ ఫిదా.. నీలాగే నేను కూడా అంటూ.. డైరెక్టర్ ట్వీట్
రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద ₹1600 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ప్రశంసలు కురిపించారు. రణ్‌వీర్ అద్భుత నటన, సినిమా నిడివి ఎక్కువైనా ఉత్కంఠగా సాగిన విధానం తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని కోహ్లీ ట్వీట్ చేశాడు.
‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ మూవీ పై పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమాపై టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటే.. ఆయన భార్య, హీరోయిన్ అనుష్క శర్మ ప్రశంసల జల్లు కురిపించారు. భారతీయ సినిమా చరిత్రలో ఇలాంటి అనుభవాన్ని తానెప్పుడూ పొందలేదని కోహ్లి ట్వీట్ చేశాడు. దాదాపు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ, ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా, భావోద్వేగంతో సాగిందన్నాడు. సినిమా చూస్తున్నంత సేపు తాను కనీసం కనురెప్ప కూడా వేయలేదంటూ కోహ్లీ తన పోస్టులో రాసుకొచ్చాడు. అంతేకాదు దర్శకుడు ఆదిత్య ధర్ అద్భుతమైన ప్రతిభను, రణ్‌వీర్ సింగ్ నటనను ఆయన కొనియాడారు. రణ్‌వీర్ ఈ చిత్రంతో సరికొత్త శిఖరాలను చేరుకున్నారని, ఆయన నటనకు ‘అద్భుతం’ అనే పదం కూడా తక్కువేనని కోహ్లీ తన ట్వీట్‌లో కోట్ చేశాడు. కోహ్లీతో పాటే అనుష్క శర్మ కూడా ఈ సినిమా తనను ఎంతగానో కట్టిపడేసిందని పోస్ట్ చేశారు. కోహ్లీ దంపతుల ప్రశంసలపై దర్శకుడు ఆదిత్య ధర్ కూడా వెంటనే రియాక్టయ్యాడు. విరాట్ ప్రశంసలు తనకు ఎంతో విలువైనవంటూ ట్వీట్ చేశాడు. విరాట్‌కు తాను పెద్ద అభిమానినని.. మైదానంలో విరాట్ చూపే పోరాట పటిమ అందరికీ స్పూర్తిదాయకం అంటూ రాసుకొచ్చాడు. దేశం గర్వపడేలా విరాట్ ఎలా ఆడతాదో.. తాను తన సినిమాల ద్వారా కూడా అదే ప్రయత్నం చేస్తానంటూ తన ట్వీట్‌లో కోట్ చేశాడు ఆధిత్య ధర్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదిరిందయ్యా చంద్రం! ‘ఎర్త్‌రైజ్’, ‘ఎర్త్‌సెట్’ చూసారా ??
Peddi: నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే భారీ ధరకు పెద్ది రైట్స్
Dhurandar 2: కలెక్షన్స్‌పై రివెంజ్‌లా ఉంది పరిస్థితి.. ప్రపంచవ్యాప్త సంచలన వసూళ్లు
Devara – 2: కొరటాల సిద్ధం.. కానీ అంతా ఎన్టీఆర్ చేతుల్లోనే !!
Peddi: పెద్ది మాటే చెల్లకపోతే ఎట్టా !! గందరగోళంగా మారిన పెద్ది రిలీజ్ డేట్
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

