AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరిందయ్యా చంద్రం! ‘ఎర్త్‌రైజ్’,  ‘ఎర్త్‌సెట్’  చూసారా ??

అదిరిందయ్యా చంద్రం! ‘ఎర్త్‌రైజ్’, ‘ఎర్త్‌సెట్’ చూసారా ??

Phani CH
|

Updated on: Apr 09, 2026 | 6:00 PM

Share

నాసా ఆర్టెమిస్-2 మిషన్‌లో నలుగురు వ్యోమగాములు ఓరియన్ నౌకలో చంద్రుడికి దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టించారు. భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించి, చంద్రుడి ఉపరితలం, సూర్యగ్రహణం, 'ఎర్త్‌రైజ్' వంటి అద్భుత దృశ్యాలను వీక్షించారు. 40 నిమిషాల కమ్యూనికేషన్ బ్రేక్ తర్వాత, వ్యోమగాములు భూమితో సంబంధం పునరుద్ధరించడంపై సంతోషం వ్యక్తం చేశారు. వారి పరిశీలనలు చంద్రుడి పుట్టుకపై విలువైన సమాచారాన్ని అందిస్తాయి. ఓరియన్ ఇప్పుడు భూమికి సురక్షితంగా తిరిగి వస్తోంది.

నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్‌లో నలుగురు వ్యోమగాములు ఓరియన్ నౌకలో చంద్రుడికి దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 6న బయలుదేరిన వీరు ఇప్పటివరకు ఏ వ్యోమగామి ప్రయాణించనంత దూరం అంతరిక్షంలోకి ప్రయాణించి సరికొత్త చరిత్రను సృష్టించారు. ఓరియన్ నౌక చంద్రుడి వెనుక భాగానికి వెళ్లినప్పుడు, హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్‌తో సంబంధాలు 40 నిమిషాల పాటు తెగిపోయాయి. అంతరిక్షంలో ఆ నిశ్శబ్దం ఉత్కంఠగా మారింది. తిరిగి భూమితో సంబంధం ఏర్పడిన తర్వాత వ్యోమగామి క్రిస్టినా స్పందిస్తూ.. భూమితో మళ్లీ సంబంధం ఏర్పడటం సంతోషంగా ఉందని అన్నారు. చంద్రుడి వెనుక భాగంలో ప్రయాణిస్తున్న సమయంలో వ్యోమగాములు తమ పరిశీలనలను రికార్డ్ చేశారు. చంద్రుడి ఉపరితలాన్ని దగ్గరగా ఫోటోలు తీస్తూ.. అక్కడి అగ్నిపర్వత బిలాలు, ప్రాచీన లావా ప్రవాహాలు, లోతైన పగుళ్లు, కొండలు వంటి నిర్మాణాలను విశ్లేషించారు. ఉపరితలంపై రంగులు, కాంతి తీవ్రత, ఆకృతిలో మార్పులను వారు గమనించారు. ఆ సమాచారం చంద్రుడి నిర్మాణం, పుట్టుకను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది. ఈ అరుదైన ప్రయాణంలో వ్యోమగాములు ‘ఎర్త్‌రైజ్’, ‘ఎర్త్‌సెట్’ వంటి అద్భుతాలను చూసారు. చంద్రుడి హోరైజన్ కిందకు భూమి అస్తమించడం, మళ్లీ అంతరిక్ష నౌక అవతలి వైపు నుంచి బయటకు వచ్చినప్పుడు భూమి ఉదయించడం వారు కళ్లారా చూశారు. అదే సమయంలో చంద్రుడు, సూర్యుడు, అంతరిక్ష నౌక ఒకే సరళరేఖలోకి రావడంతో సూర్యగ్రహణాన్ని చూసే అవకాశం దొరికింది. గ్రహణ సమయంలో సూర్యుని ‘కరోనా’ను అధ్యయనం చేశారు. చంద్రుడి చీకటి భాగంలో ప్రయాణిస్తున్నప్పుడు, ఉపరితలాన్ని తాకిన ఆరు ఉల్కల కాంతి మెరుపులను గుర్తించారు. మిషన్ కమాండర్ రీడ్ వైస్‌మ్యాన్ ఏం చెప్పారంటే.. ‘మానవ మాత్రులెవరూ చూడని అద్భుత దృశ్యాలను మేం చూశాం’ అని చెప్పారు. విజయవంతంగా చంద్రుడి ఫ్లైబైని పూర్తి చేసుకున్న ఓరియన్, ఇప్పుడు సురక్షితంగా భూమికి తిరుగు ప్రయాణమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Peddi: నెట్‌ఫ్లిక్స్‌ చరిత్రలోనే భారీ ధరకు పెద్ది రైట్స్

Dhurandar 2: కలెక్షన్స్‌పై రివెంజ్‌లా ఉంది పరిస్థితి.. ప్రపంచవ్యాప్త సంచలన వసూళ్లు

Devara – 2: కొరటాల సిద్ధం.. కానీ అంతా ఎన్టీఆర్ చేతుల్లోనే !!

Peddi: పెద్ది మాటే చెల్లకపోతే ఎట్టా !! గందరగోళంగా మారిన పెద్ది రిలీజ్ డేట్

Trisha: ‘పెళ్లైంది.. పిల్లలు కూడా ఉన్నారు’ మరి విజయ్ సంగతేంటి ??

Follow Us