Peddi: పెద్ది మాటే చెల్లకపోతే ఎట్టా !! గందరగోళంగా మారిన పెద్ది రిలీజ్ డేట్
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న పెద్ది సినిమా విడుదల తేదీపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఏప్రిల్ 30న వస్తుందని చరణ్ స్వయంగా చెప్పినప్పటికీ, పాట, ట్రైలర్ బ్యాలెన్స్ ఉండటంతో జూన్ నెలకు వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అభిమానులు ఆందోళనలో ఉండగా, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా పెద్ది రిలీజ్ పైనే పెద్ద చర్చ జరుగుతోంది. పెద్ది నోరు తెరచి చెప్పనట్టే ఈ మూవీ ఏప్రిల్ 30 న రిలీజ్ అవుతాందా? లేక వషరా మామూలుగానే మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందా? అనే క్యూరియాసిటీ సగటు మెగా అభిమానిని పరేషాన్ చేస్తోంది. చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది. చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. చివరగా ఏప్రిల్ 30 వ తేదీ లాక్ అయింది. ఆ డేట్ రోజే వరల్డ్ వైడ్ పెద్ది మూవీ రిలీజ్ అనుందని మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అయినా కానీ… ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా తెరుచుకోకపోవడంతో.. పెద్ది మూవీ ఏప్రిల్ 30న వచ్చే పరిస్థితి లేదనే టాక్ వినిపించింది. ఈ టాక్ కు ఎండ్ కార్డ్ వేస్తూ.. నేరుగా పెద్దినే నోరు విప్పాడు. రీసెంట్‌గా ‘రాకాస’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో.. పెద్ది టాక్ పార్ట్ కంప్లీట్ అయిందని.. నో పోస్ట్ పోన్ అని చరణ్ చెప్పాడు. కట్ చేస్తే మళ్లీ ఈ సినిమా రిలీజ్ పై పోస్ట్ పోన్ టాక్ వినిపిస్తోంది. ఇంకో సాంగ్ బ్యాలెన్స్ ఉండడం.. ట్రైలర్ కూడా రెడీ అవకపోవడంతో.. పెద్దిని జూన్ నెలలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ఇప్పుడు థింక్ చేస్తున్నారట. మరో రెండు మూడు రోజుల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రాబోతున్నట్టుగా ఇన్‌సైడ్ న్యూస్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trisha: ‘పెళ్లైంది.. పిల్లలు కూడా ఉన్నారు’ మరి విజయ్ సంగతేంటి ??
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధింపు
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

