AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara - 2: కొరటాల సిద్ధం.. కానీ అంతా ఎన్టీఆర్ చేతుల్లోనే !!

Devara – 2: కొరటాల సిద్ధం.. కానీ అంతా ఎన్టీఆర్ చేతుల్లోనే !!

Phani CH
|

Updated on: Apr 09, 2026 | 5:18 PM

Share

దేవర 1 డీసెంట్ హిట్ అయినా, దేవర 2 విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. కొరటాల శివ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి ఎన్టీఆర్ కోసం వేచి చూస్తుండగా, ఎన్టీఆర్ వార్, డ్రాగన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆరోగ్య సమస్యలు, డేట్స్ కారణంగా దేవర 2కి సమయం కేటాయించలేకపోతున్నారు. పార్ట్ 2 షూటింగ్ ప్రారంభం పూర్తిగా ఎన్టీఆర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

దేవర 1, 2024 సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా.. కొన్ని విమర్శలను పక్కు పెడితే.. బాక్సాఫీస్‌ దగ్గర బానే పర్ఫార్మ్‌ చేసింది. డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన దాదాపు సంవత్సరంనర కావస్తోంది. కానీ ఇప్పటికీ దేవర 2 సినిమాపై మాత్రం అదే సస్పెన్స్‌ కొనసాగుతోంది. దేవర సినిమా తర్వాత వార్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో ఇప్పుడు బిజీగా ఉన్నాడు. కానీ మరో పక్క కొరటాల శివ మాత్రం.. దేవర సినిమా తర్వాత మరో సినిమాను చేయకుండా దేవర 2 స్క్రిప్ట్‌ను పట్టుకునే కూర్చున్నాడు. దేవర2 స్క్రిప్ట్‌ను మరింత గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దుతూ.. మరింత ఎమోషనల్‌గా సీన్లను మలుచుకుంటూ.. పార్ట్‌ 2 మీదే ఎక్కువ కాలం టైం స్పెండ్ చేశాడు. తనవైపు ఏ చిన్న పొరపాటు కానీ.. ఆలస్యం కానీ లేకుండా.. దేవర2 స్క్రిప్ట్‌తో వెయిట్‌ చేస్తున్నాడు కొరటాల. కానీ మరో పక్క తారక్ మాత్రం… తన కమిట్‌మెంట్స్‌ వల్ల.. డేట్స్‌ వల్ల.. మధ్యలో వచ్చిన చిన్న చిన్న హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల.. దేవర2కి టైం ఇవ్వలేక పోతున్నట్టు టాక్. దీంతో దేవర2 షూటింగ్ మొదలు కావడం అనేది.. పూర్తిగా తారక్ చేతుల్లోనే ఉన్నట్టు ఇన్‌సైడ్ రిపోర్ట్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Peddi: పెద్ది మాటే చెల్లకపోతే ఎట్టా !! గందరగోళంగా మారిన పెద్ది రిలీజ్ డేట్

Trisha: ‘పెళ్లైంది.. పిల్లలు కూడా ఉన్నారు’ మరి విజయ్ సంగతేంటి ??

గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్‌

కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధింపు

దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది

Follow Us