Raaka: క్రూరుడు.. కత్తిలాంటి కుర్రాడు.. బన్నీ డ్యుయల్ రోల్
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న 'రాకా' మూవీ ఫస్ట్ లుక్ సంచలనం సృష్టించింది. రాక్షసుడిని పోలిన బన్నీ లుక్, టైటిల్ అర్థంపై చర్చ జరుగుతోంది. 'రాకా' అంటే మృగ ప్రవృత్తి, విధ్వంసకర శక్తి అని తెలుస్తోంది. సినిమాలో బన్నీ రెండు షేడ్స్‌లో, హీరో/విలన్ పాత్రల్లో కనిపిస్తాడనే వార్తలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
బన్నీ హీరోగా అట్లీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ రాకా. బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఐకాన్ స్టార్ లుక్. ఇప్పుడు అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది. దాంతో పాటే .. అసలీ టైటిల్‌కు అర్థం ఏంటనే ఆరాలు కూడా ఇప్పుడు నెట్టింట ఎక్కువవయ్యాయి. అయితే అకార్డింగ్ రిపోర్ట్స్ రాక్షసుడు, రాకాసి అనే పదాల మూలాల నుంచే ఈ ‘రాకా’ పుట్టినట్లు తెలుస్తోంది. మనిషిలోని మృగ ప్రవృత్తిని లేదా ఒక విధ్వంసకర శక్తిని సూచించేలా ఈ పేరును డిజైన్ చేసినట్లు స్పష్టమవుతోంది. టైటిల్‌కు తగ్గట్టే బన్నీ ఫస్ట్ లుక్ కూడా ఉండడంతో.. ఈ సినిమాలో బన్నీ రాక్షసుడిగా కనిపించనున్నాడనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ – అట్లీ సినిమా నుంచి రాకా లుక్ రివీల్ అయింది. పెద్ద గోర్లతో.. తోడేలు కాలు లాంటి చేతులతో.. గుండుతో.. అచ్చం రాక్షసుడిలా ఉన్న బన్నీ లుక్ ఇప్పుడు అందర్నీ స్టన్ అయ్యేలా చేస్తోంది. అయితే రీసెంట్ డేస్‌లో బన్నీ మాత్రం చిన్న హెయిర్ స్టైల్‌తో.. మోడ్రన్‌గా కనిపిస్తుండడాన్ని గమనిస్తున్న అల్లు ఆర్మీ.. రాకా సినిమాలో.. బన్నీనే హీరో అని.. విలన్ అని ప్రచారం చేస్తున్నారు. రెండు కాలాల మధ్య సాగే ఈ సినిమాలో.. బన్నీ రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తుండడం.. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ నట విశ్వరూపం ఈ సినిమాతో ఖాయమనే టాక్ ఆయన ఫ్యాన్స్ మధ్య నడుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘అటు మామ.. ఇటు బావ..’ అబ్బో.. ఖుషీగా బన్నీ
TOP 5 ET: ఆయనే ముందు ప్రపోజ్ చేశారు.. – అన్నా
Virat Kohli: ధురంధర్‌కి విరాట్ ఫిదా.. నీలాగే నేను కూడా అంటూ.. డైరెక్టర్ ట్వీట్
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

