AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పిల్లి పోయిందని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ.. సీసీ ఫుటేజ్‌ చూసి అంతా షాక్.. కట్‌చేస్తే..

హైదరాబాద్‌లో చిన్న విషయమే పెద్ద చర్చగా మారిన ఘటన వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన పెంపుడు పిల్లి విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం, చినికి, చినికి గాలివానగా మారింది. అది కాస్తా చివరికి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. అక్కడ కూడా ఇరువురి మధ్య సుమారు గంటల పాటు జరిగిన చర్చల తర్వాత సమస్య సద్దుమణిగింది. ఇంతకూ అక్కడ జరిగిన సీన్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Hyderabad: పిల్లి పోయిందని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ.. సీసీ ఫుటేజ్‌ చూసి అంతా షాక్.. కట్‌చేస్తే..
Hyderabad Pet Cat Dispute
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 12:06 PM

Share

ఓ పెంపుడు పిల్లి విషయంలో చిన్నగా మొదలైన గొడవ చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. లల్లాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టకు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లి కనిపించకుండా పోయిందని పోలీసులను ఆశ్రయించింది. తన ఇంటి ముందు ఉన్న పిల్లిని ఓ వ్యక్తి తీసుకెళ్లాడని ఆమె ఆరోపించింది. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన ఆమె, బైక్ నంబర్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించి ఫిర్యాదు చేసింది.

పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, ఆ వ్యక్తి చింతల్ ప్రాంతానికి చెందిన మొక్కలు అమ్మే వ్యాపారి అని తేలింది. అతడిని స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించగా, పిల్లిని పట్టుకునే ప్రయత్నంలో అది తన చేతిని కరిచి పారిపోయిందని చెప్పాడు. అయితే, తన పిల్లిని తిరిగి ఇవ్వాలని మహిళ పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి వాదనలు విన్న పోలీస్ ఇన్స్పెక్టర్ దాదాపు అరగంటపాటు కౌన్సెలింగ్ నిర్వహించారు.

చివరికి ఆ వ్యక్తి మహిళకు క్షమాపణ చెప్పడంతో వివాదం తాత్కాలికంగా ముగిసింది. పోలీస్‌లు అతడికి హెచ్చరిక జారీ చేసి వదిలేశారు. ఇక, ఈ వ్యవహారంపై స్టేషన్ వెలుపల ఎదురు చూస్తున్న ఇతర ఫిర్యాదుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చిన్న విషయం పెద్దగా మారి, పోలీసుల విలువైన సమయాన్ని గంటల వేస్ట్ చేయడంతో ఆగ్రహం వ్యక్తమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us