చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్కేస్తున్న టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్లు
తెలుగు ట్రెండింగ్ హీరోయిన్లు మమితా బైజు, కృతి శెట్టి, కయాదు లోహర్, శ్రీలీల ఇప్పుడు కోలీవుడ్‌పై దృష్టి సారిస్తున్నారు. టాలీవుడ్‌లో సరైన అవకాశాలు లేకనా లేక తమిళనాట మంచి ప్రాజెక్టులు వస్తున్నాయా అనేది చర్చనీయాంశం. విజయ్, సూర్య, ధనుష్ వంటి స్టార్స్‌తో వీరు చేస్తున్న క్రేజీ సినిమాలతో కోలీవుడ్‌లో బిజీగా మారారు. ఈ భామల కొత్త ప్రయాణం గురించి వివరాలు.
టాలీవుడ్‌ను కొన్ని రోజుల పాటు ఊపేసిన ట్రెండింగ్ హీరోయిన్ల చూపు ఇప్పుడు కోలీవుడ్ వైపు మళ్లిందా..? ఇక్కడ సరైన అవకాశాలు లేక మన భామలంతా మూటముల్లె సర్దుకుని పక్క రాష్ట్రానికి పయనమవుతున్నారా లేదంటే అక్కడ్నుంచి ఇక్కడి కంటే మంచి అవకాశాలు వాళ్లకు వస్తున్నాయా..? అసలు ఈ బ్యూటీస్ చేస్తున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి..? ఇంతకీ ఎవరా హీరోయిన్లు..? ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మమితా బైజు.. కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆల్రెడీ విజయ్‌తో చేసిన జన నాయగన్ విడుదలకి సిద్ధంగా ఉంటే.. సూర్య, వెంకీ అట్లూరి కలిసి చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్‌తో పాటు ధనుష్ కారా సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సైతం కొన్నేళ్లుగా తమిళంలోనే మకాం వేసారు. తాజాగా LIKతో వస్తున్నారు. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కయాదు లోహర్ కూడా తెలుగు కంటే తమిళంపైనే ఫోకస్ చేసారు.. అక్కడే వరస అవకాశాలు అందుకుంటున్నారు. కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నారు ఈ భామ. ఈ మధ్యే సాయి అభ్యంకర్‌తో కలిసి చేసిన ఓ ప్రైవేట్ సాంగ్ యూ ట్యూబ్‌లో 100 మిలియన్ల వైపు వెళ్తుంది. టాలీవుడ్‌లో ఎంట్రీతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల కూడా కాస్త గ్యాప్ తీసుకుని తమిళనాట అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొన్న పొంగల్‌కు పరాశక్తితో డెబ్యూ చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ధనుష్ సినిమాలో నటిస్తున్నారు. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి ఈ హీరోయిన్స్ అంతా ఒకేసారి కోలీవుడ్ బాట పట్టేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTR సినిమాపై కావాలనే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారా..?
Peddi: పెద్దిపై మరో పిడుగు.. రామ్ చరణ్ ఏం చేస్తారో..?
Anna Lezhneva: ఒకరికి బర్త్‌డే.. మరొకరికి పునర్జన్మ.. పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

