AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anna Lezhneva: ఒకరికి బర్త్‌డే.. మరొకరికి పునర్జన్మ.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Lezhneva: ఒకరికి బర్త్‌డే.. మరొకరికి పునర్జన్మ.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Phani CH
|

Updated on: Apr 09, 2026 | 6:50 PM

Share

ఏప్రిల్ 8 తమ కుటుంబానికి ఎంతో భావోద్వేగ దినమని పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్నేవా అన్నారు. అకీరా నందన్ పుట్టినరోజుతో పాటు, ఏడాది క్రితం సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుండి కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమని గుర్తుచేసుకున్నారు. రక్షించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలిపారు.

ఏప్రిల్‌ 8 తమ కుటుంబానికి ఎంతో ఎమోషనల్‌ డే అని పవన్‌ కల్యాణ్ భార్య అన్నా లెజ్నోవా అన్నారు. 8న అకీరానందన్‌ పుట్టినరోజు సందర్భంగా విషెస్‌ తెలిపారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదేరోజు సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ ప్రమాదంలో చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ చిక్కుకోవడంతో తన కుటుంబం వణికిపోయిందని తెలిపారు. మార్క్ ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమని అన్నారు. ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేమనీ చెప్పారు. అకీరా పుట్టినరోజు, అతను ఎదుగుతున్న తీరును చూస్తుంటే తమకు చాలా గర్వంగా ఉందని అన్నారు. అకీరా ప్రతీ విషయాన్ని లోతుగా ఆలోచించి తెలుసుకుంటాడనీ ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తితో ఉంటాడనీ రాసుకొచ్చారు. గతేడాది ఇదే రోజు మార్క్‌ అగ్నిప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడనీ అందుకే ఈ రోజును తాము తమ ఇద్దరు అబ్బాయిల విషయంలో సెలబ్రేట్‌ చేసుకుంటున్నామనీ మార్క్‌కు ఇది నిజంగా పునర్జన్మ అనీ పోస్ట్‌లో తెలిపారు. ఏడాది గడిచినా ఆ ప్రమాదంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉందనీ అన్నారు. 10 ఏళ్ల వయసున్న ఓ చిన్నారి మరణానికి, 18 మంది పిల్లలు ఆసుపత్రి పాలవడానికి కారణం ఎవరో తమకు ఇప్పటికీ తెలియదనీ చెప్పారు. దేవుడి దయ వల్ల మార్క్ ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి క్షేమంగా ఉన్నాడనీ అన్నా పోస్టులో రాసుకొచ్చారు. చిన్నారి మార్క్‌ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతుంటే ఆసుపత్రి బెడ్ పక్కన కూర్చొని బాధపడిన రోజులు తనకు ఇంకా గుర్తున్నాయనీ ఏ తల్లికీ అలాంటి పరిస్థితి రాకూడదనీ అన్నా వాపోయారు. మార్క్‌తో పాటు 15 మంది పిల్లల్ని కాపాడిన కార్మికులకు తను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాననీ చెప్పారు. వాళ్లు నిజమైన హీరోలు అంటూ ఆ రోజును అన్నాలెజ్నోవా గుర్తుచేసుకున్నారు. ఆ ప్రమాదం ఫొటోలతో పాటు తాను తిరుమలలో తలనీలాలు సమర్పించిన ఫొటోను కూడా షేర్‌ చేసారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Raaka: క్రూరుడు.. కత్తిలాంటి కుర్రాడు.. బన్నీ డ్యుయల్ రోల్

‘అటు మామ.. ఇటు బావ..’ అబ్బో.. ఖుషీగా బన్నీ

TOP 5 ET: ఆయనే ముందు ప్రపోజ్ చేశారు.. – అన్నా

Virat Kohli: ధురంధర్‌కి విరాట్‌ ఫిదా.. నీలాగే నేను కూడా అంటూ.. డైరెక్టర్‌ ట్వీట్

అదిరిందయ్యా చంద్రం! ‘ఎర్త్‌రైజ్’, ‘ఎర్త్‌సెట్’ చూసారా ??

Follow Us