బన్నీకి బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా ఏదో తెలుసా? ఏకంగా అన్ని సార్లు చూశాడా?

09 April 2026

Basha Shek

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న (ఏప్రిల్ 08) తన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, అభిమానులు నేరుగా బన్నీ ఇంటికి వెళ్లి బర్త్ డే విషెస్ చెప్పారు.

అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా ఎంతో మంది నెటిజన్లు అల్లు అర్జున్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

దీంతో సామాజిక మాధ్యమాల్లో బన్నీ పేరు మార్మోగిపోయింది. ఇదే క్రమంలో అతనికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి.

కాగా అల్లు అర్జున్‌కి  బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా? ఒక సందర్భంలో బన్నీనే స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.

ఎన్నిసార్లు అయినా చూడదగ్గ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన `ఇంద్ర` సినిమా అని బన్నీ చెప్పుకొచ్చాడు.

హాలీవుడ్‌లో `టైటానిక్‌`, తెలుగులో `ఇంద్ర` సినిమా అని, ఈ మూవీని ఎప్పుడు చూసినా కొత్తగా ఉంటుందని, ఏదో ఒక కొత్త ఫీలింగ్‌ని కలిగిస్తుందని అల్లు అర్జున్ పేర్కొన్నాడు.

చిరంజీవి కోసం  ఇంద్ర మూవీని ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదని బన్నీతన రుద్రమ దేవి సినిమా ప్రమోషన్లలో చెప్పుకొచ్చాడు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.