డెకాయిట్ స్టేజ్ మీద మళ్లీ సీతారామమ్ ప్రస్తావన
సీతారామం సినిమా ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. దాని కూల్ బ్రీజ్ అనుభవం, మృణాల్ ఠాకూర్‌పై ప్రభావం, సుమంత్ ప్రస్తావనలు ఈ సినిమా ప్రత్యేకతను చాటుతున్నాయి. సీక్వెల్ చర్చలు, దుల్కర్-మృణాల్ పాట వైరల్ అవ్వడం దీనికి నిదర్శనం. మృణాల్ కెరీర్‌లో అంతకంటే గొప్ప ప్రేమకథ వచ్చేవరకు సీతారామం ప్రాముఖ్యత కొనసాగుతుంది.
కొన్ని సినిమాలు మన ఆలోచనల నుంచి అంత తేలిగ్గా సైడ్ అవ్వవు. ఒకవేళ ఫేడ్ అవుతున్న పరిస్థితులే కనిపించినా ఇమీడియేట్‌గా వాటిని కలర్‌ఫుల్‌గా కంటి ముందు నిలిపే విషయాలు ఎక్కడో ఓ చోట పాపప్ అవుతాయి. మీరు బాగా గమనిస్తే సీతారామమ్ విషయంలోనూ ఇలాంటిది జరుగుతన్నట్టే అనిపిస్తుంది… అంతేనంటారా? ఓ సారి డిస్కస్ చేసుకుందాం పదండి.. సీతారామమ్ సినిమాను అంత తేలిగ్గా మర్చిపోలేరు సినీ ప్రియులు. సిల్వర్‌స్క్రీన్ మీద కూల్ బ్రీజ్ అంటూ నేషనల్ వైడ్‌గా అప్లాజ్ అందుకుంది ఆ సినిమా. సీతారామమ్ రిలీజ్ అయిన తర్వాత మృణాల్‌ని నార్త్ వాళ్లందరూ సౌత్ లేడీ అనే అనుకున్నారట. కాదు, నేను మరాఠీని అని స్పెషల్‌గా చెప్పుకోవాల్సి వచ్చిందట ఈ బ్యూటీ. అప్పుడే కాదు, మృణాల్ లేటెస్ట్ మూవీ డెకాయిట్ వేడుకలోనూ సీతారామమ్ ప్రస్తావన వచ్చింది. ‘సారీ మృణాల్.. అప్పుడు రామ్‌తో నిన్ను విడదీశాను. ఇప్పుడు డెకాయిట్‌తో నీ ప్రేమను కలుపుతోంది మా సిస్టర్’ అంటూ స్టేజ్ మీద సీతారామమ్‌ని గుర్తుచేసి నవ్వులు పూయించారు సుమంత్. సీతారామమ్‌కి సీక్వెల్ ఉంటుందా? లేదా? అనే చర్చలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దుల్కర్, మృణాల్ కలిసి ఆ మధ్య ఓ స్పెషల్ సాంగ్ చేస్తే అది ఇన్‌స్టంట్‌గా వైరల్ అయింది. మళ్లీ మృణాల్ కెరీర్‌లో సీతారామమ్‌ని మించిన లవ్ స్టోరీ వచ్చేవరకు ఈ డిస్కషన్‌కి ఫుల్ స్టాప్ పడదని అంటున్నారు అబ్జర్వర్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Raaka: క్రూరుడు.. కత్తిలాంటి కుర్రాడు.. బన్నీ డ్యుయల్ రోల్
‘అటు మామ.. ఇటు బావ..’ అబ్బో.. ఖుషీగా బన్నీ
TOP 5 ET: ఆయనే ముందు ప్రపోజ్ చేశారు.. – అన్నా
Virat Kohli: ధురంధర్‌కి విరాట్ ఫిదా.. నీలాగే నేను కూడా అంటూ.. డైరెక్టర్ ట్వీట్
అనంతపురంలో సిమ్లా యాపిల్స్ సాగు.. ఇదిగో ఇలా..
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
మహానగరంలో మ్యాట్రిమోనీ మాయగాడు
త్వరలో నన్ను కూడా చంపేస్తారేమో!
నేను మద్యం సేవించి పోలీస్టేషన్‌కు రాలేదు!
మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట కోట్లాది రూపాయలకు కుచ్చుటోపీ
తెలుగురాష్ట్రాల్లో భానుడి భగభగలు.. నిప్పులగుండంలా విజయవాడ, వరంగల్

