ఐపీఎల్ తో పోటీ పడుతున్న ఆ సినిమాలు.. సమ్మర్‌లో ఏం చేస్తారో..?
ఐపీఎల్ కారణంగా పెద్ద హీరోలు తప్పుకోవడంతో, ఈ సమ్మర్ టాలీవుడ్‌కు కీలకంగా మారింది. అగ్ర హీరోలు లేకున్నా, క్రేజీ కాన్సెప్టులతో మీడియం బడ్జెట్ సినిమాలు, మల్టీస్టారర్లు ఈ వేసవిలో క్యూ కడుతున్నాయి. అడివి శేష్, నాగశౌర్య, సాయిపల్లవి, సమంత వంటి నటీనటుల సినిమాలు ఏప్రిల్, మే నెలల్లో విడుదలై ప్రేక్షకులకు వినోదం పంచనున్నాయి. థియేటర్లలో వినోదానికి ఎలాంటి లోటు ఉండదని స్పష్టం.
IPL ఫీవర్‌తో బడా హీరోలంతా బాక్సాఫీస్ బరి నుంచి తప్పుకోగా.. ఈ సమ్మర్ అంతా చప్పగా సాగనుంది. అందుకే రాబోయే 50 రోజులు మాత్రం టాలీవుడ్‌కు చాలా కీలకంగా మారాయి. అయితే అగ్ర హీరోల సందడి లేకపోయినా క్రేజీ కాన్సెప్టులతో మీడియం రేంజ్ సినిమాలు, డిఫరెంట్ మల్టీస్టారర్లు బ్యాక్ టు బ్యాక్ క్యూ కట్టడంతో థియేటర్లలో వినోదానికి ఎలాంటి డోకా లేదు. మరి అవేంటో చూద్దామా..?ఈ సమ్మర్‌లో స్టార్స్ లేకపోయినా.. చిన్నవాళ్ళే అంతా తామై చూసుకుంటున్నారు. ఏప్రిల్ 10న అడివి శేష్ డెకాయిట్, ప్రదీప్ రంగనాథన్ LIK సినిమాలు రానున్నాయి. ఇక ఏప్రిల్ 17న నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్‌తో పాటు కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న తిమ్మరాజుపల్లి టీవీ, తిరువీర్ హీరోగా నటిస్తున్న పాపం ప్రతాప్ సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ది సినిమా వాయిదా పడటం దాదాపు ఖాయం కావడంతో.. మే ఒకటో తేదీన చాలా సినిమాలు క్యూ కట్టాయి. తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం, మమ్ముట్టి మోహన్ లాల్ క్రేజీ మల్టీస్టారర్ పాట్రియాట్ మే 1నే రానున్నాయి. ఇక సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ ఏక్ దిన్ తెలుగు వెర్షన్, రితేష్ దేశ్ ముఖ్ రాజా శివాజీ కూడా అదే రోజున రాబోతున్నాయి. మే 8న తేదీన కమెడియన్ సత్య హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రితేష్ రానా తెరకెక్కిస్తున్న జెట్లీ రాబోతుంది. మత్తు వదలరా టీం నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు బానే ఉన్నాయి. ఆ తర్వాత మే 15న సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం రానుంది. మొత్తానికి ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఐపిఎల్‌ను తట్టుకుని ఆడియన్స్‌ను అలరించడానికి వచ్చేస్తున్నాయి ఈ సినిమాలన్నీ..!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Raaka: క్రూరుడు.. కత్తిలాంటి కుర్రాడు.. బన్నీ డ్యుయల్ రోల్
‘అటు మామ.. ఇటు బావ..’ అబ్బో.. ఖుషీగా బన్నీ
TOP 5 ET: ఆయనే ముందు ప్రపోజ్ చేశారు.. – అన్నా
Virat Kohli: ధురంధర్‌కి విరాట్ ఫిదా.. నీలాగే నేను కూడా అంటూ.. డైరెక్టర్ ట్వీట్
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

